కొవ్వూరు : కొవ్వూరు నియోజకవర్గం లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఒక
పండుగలా సాగుతోంది. 73 వ రోజు కొవ్వూరు మండలం ఊనగట్ల గ్రామంలో హోం మంత్రి
తానేటి వనిత పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని నాయకులు, మహిళలు హోంమంత్రి
కి ఘన స్వాగతం పలికారు. ఏ ఇంటికి వెళ్లినా తమకు ఐదారు ప్రభుత్వ సంక్షేమ పథకాలు
అందుతున్నాయని లబ్ధిదారులు సంతోషం వ్యక్తంచేశారు. గ్రామ సచివాలయ సిబ్బంది తమ
ఇంటికి వచ్చి మరి సంక్షేమ పథకాలను అందిస్తున్నారని తెలిపారు. సీఎం జగన్ ఎలాంటి
పక్షపాతం లేకుండా పారదర్శక పాలన అందిస్తున్నారని లబ్ధిదారులు హోంమంత్రి కి
వివరించారు. సీఎం జగన్ సూచన మేరకు ప్రజా సమస్యలను తెలుసుకొని
పరిష్కరించడానికే గడప గడప కార్యక్రమం చేస్తున్నట్లు హోంమంత్రి తానేటి వనిత
పేర్కొన్నారు.