మూడున్నరేళ్లలో ఎస్సీల కోసం రూ.48,899 కోట్లు ఖర్చు
దుర్మార్గపు రాతలతో ప్రజలను మోసం చేస్తారా అని మండిపాటు
అడగకుండానే పదేళ్లు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పెంపు: వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్
రాష్ట్ర అధ్యక్షులు జూపూడి ప్రభాకర్‌రావు
ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతే సీఎం జగన్ ధ్యేయమని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్
రాష్ట్ర అధ్యక్షులు జూపూడి ప్రభాకర్‌రావు తెలిపారు. సోమవారం పార్టీ కేంద్ర
కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఎవరూ అడగకుండానే ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్‌ను మరో
పదేళ్ల పాటు కొనసాగిస్తూ అర్డినెన్స్ చేసిన గొప్ప మనసున్న ముఖ్యమంత్రి జగన్
మోహన్ రెడ్డి అని ఆయన కొనియాడారు. ఎస్సీ సబ్‌ప్లాన్‌పై కేంద్ర గణాంకాల్లో
ఏపీకి తొలి స్థానం వచ్చిందని గుర్తు చేశారు.
చంద్రబాబు హయాంలో సబ్‌ప్లాన్ నిధులు కూడా ఖర్చు చేయలేదని పేర్కొన్నారు. ఆనాడు
చంద్రబాబు అరాచకాలను రామోజీరావు ఎందుకు ప్రశ్నించలేదని ఆయన నిలదీశారు. ఎస్సీ,
ఎస్టీల అభివృద్ధిపై రామోజీ చర్చకు సిద్ధమా అని జూపూడి ప్రభాకర్‌రావు సవాలు
విసిరారు. సబ్‌ప్లాన్‌పై ఈనాడు పొట్ట రాక్షసుడు అసత్యాలు రాస్తున్నారని
మండిపడ్డారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే హక్కు రామోజీరావుకు లేదని
ధ్వజమెత్తారు.
2014–2015 నుంచి 2018–2019 వరకు అంటే దాదాపు ఐదేళ్లు గత టీడీపీ ప్రభుత్వం
ఎస్సీల కోసం రూ.33,625 కోట్లు ఖర్చు చేస్తే, సీఎం జగన్ మూడున్నరేళ్లలో
రూ.48,899 కోట్లు ఎస్సీల కోసం ఖర్చు చేశారని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం
అనేక సంక్షేమ పథకాల్లో సాటిలేని రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌లో ఏపీ
అగ్రస్థానం అని ప్రకటించిందని తెలిపారు. సీఎం జగన్ తీసుకువచ్చిన సంక్షేమ
కార్యక్రమాలతో దాదాపు 29 లక్షల కుటుంబాలు బాగుపడ్డాయని కేంద్రమే ప్రకటించిందని
గుర్తు చేశారు.
ఎస్సీల బాధలు వైయస్ కుటుంబానికి బాగా తెలుసని జూపూడి ప్రభాకర్ రావు అన్నారు.
సీఎం వైయస్ జగన్ పేదవారికి, ప్రధానంగా దళితులకు మేనమామ అయ్యారని చెప్పారు. ఆ
కుటుంబాల్లో భాగమై, కష్టాల్లో నష్టాల్లో అన్నింటిలో అండగా నిలిచారని
పేర్కొన్నారు. రూ.1,86,500 కోట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు పంచిపెడుతుందని
వెల్లడించారు. ప్రధానంగా డీబీటీ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోనే నేరుగా జమ
చేస్తున్నారని తెలిపారు. వైయస్ జగన్ ప్రభుత్వం ఏ విధంగా పేదలకు అండగా ఉందో
తెలుసుకునే ప్రయత్నం చేశారా అని ప్రశ్నించారు. ఈ రోజు ఊరికి దూరంగా ఉన్న
సామాజిక వర్గాలకు 32 లక్షల మందికి పక్కా ఇళ్లు కట్టించేందుకు వైయస్ జగన్
అడుగులు వేస్తున్నారని తెలిపారు.