విజయవాడ : పరిపాలన ఎలా ఉండాలో మూడున్నర ఏళ్లలో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్
రెడ్డి ఒక మోడల్‌గా నిలిచారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల
రామకృష్ణారెడ్డి అన్నారు. విజయవాడ సమీపంలోని తాడేపల్లి సి.యస్.ఆర్. ఫంక్షన్
హాల్ లో బుధవారం ఏర్పాటు చేసిన ఏపీ ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ వెల్ఫేర్
అసోసియేషన్ నూతన సంవత్సర డైరీ – క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో సజ్జల
రామకృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా సజ్జల
రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వంలో ఉద్యోగులు కూడా భాగమని ముఖ్యమంత్రి
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చూస్తున్నారన్నారు. ఉద్యోగులు లేకుండా ఏమీ
చేయలేమన్నారు. లక్ష్యాన్ని చేరువ కావడానికి అందరూ చిత్తశుద్ధితో పని చేయాలని,
అందరి సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత మా ప్రభుత్వం తీసుకుందన్నారు.
ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తాను ఎపుడూ అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.
అనంతరం ఏ పి ఎస్ సి, ఎస్ టి గజిటెడ్ వెల్ఫేర్ ఆఫీసర్స్ అసోసియేషన్
డైరీ-2023 ను, కాలెండర్ ను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి విడుదల
చేసారు. అనంతరం అసోసియేషన్ సభ్యులు ప్రభుత్వ సలహాదారునకు, ఇతర అతిధులకు
మెమెంటోలు అందించి దుశ్శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల ఎంపీ
నందిగం సురేష్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్, ప్రభుత్వ సలహాదారు సోషల్
జస్టిస్ జూపూడి ప్రభాకర్ రావు,ఎస్ టి కమిషన్ చైర్మన్ కుంభా రవిబాబు, ఇ ఎన్ సి
ఎస్. బాలూనాయక్, చీఫ్ ఇంజినీర్ జెన్కో ఎం. పద్మసుజాత, ఎస్ సి, ఎస్ టి గజిటెడ్
అధికారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు కె.వి. రమణ, జనరల్ సెక్రటరీ సునీల్ కుమార్,
పలువురు గెజిటెడ్ అధికారులు, వివిధ జిల్లాల నుండి హాజరైన గజిటెడ్ అధికారుల
సంక్షేమ సంఘ సభ్యులు పాల్గొన్నారు.