విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో ఎస్సీ, ఎస్టీ లపై జరుగుతున్న హత్యలను, అన్యాయాలను
అరికట్టాలని ఏపీ ఎస్సీ ఎస్టీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది.
కడపలో పశు సంవర్ధక శాఖలో డిప్యూటీ డైరెక్టరుగా పని చేస్తున్న డా. అచ్చన్నను
హత్య చేసిన నిందితుల పై హత్య కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
చేసి ఉరి శిక్ష విధించాలని కోరింది. ప్రభుత్వ శాఖలలోని ఉద్యోగుల ప్రమోషన్ లలో
ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ను జీ ఓ నెంబరు 2, 5 లను సక్రమంగా అమలు చేయాలని
విజ్ఞప్తి చేసింది. శనివరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోసియేషన్
గౌరవ అధ్యక్షుడు పట్టపు శీనయ్య, కృష్ణా జిల్లా గౌరవ అధ్యక్షుడు తిరుపయ్య,
ఉమ్మడి కృష్ణా జిల్లా అధ్యక్షుడు ఎన్ జగదీశ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి. శేఖర
రావు, జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ డాక్టర్ సాకా నాగమణి, డి. శ్రీనివాసరావు
మాట్లాడారు.
అడక్వసీ జి.ఓ ను రద్దు చేయాలనీ, జలవనరురుల శాఖలలో ఎఫ్ ఏ సీ లను ఎత్తి వేసి
ప్రమోషన్లను ఇవ్వాలని, ఒక వేళ కోర్టు కేసులు ఏమైనా ఉంటే అడహాక్ ప్రమోషన్లు
ఇవ్వాలని, ఎఫ్ ఏ సీ లు, ఇంఛార్జి లు ఎత్తివేయాలన్నారు. సీఎంఓ నోట్ నెంబర్
31.01.2023 ను విధిగా అమలు చేసి ఎఫ్ ఏ సి ఇంచార్జ్ లను ఎత్తి వేసి ప్రమోషన్లు
ఇవ్వాలన్నారు. జలవనరుల శాఖలో వేరే జోన్ 4,5,6 నుండి అక్కడి సర్వీస్ వదులుకుని
జోన్ -1 కు వారి సొంత అభ్యర్ధన మేరకు బదిలీ అయ్యి అప్పటికే జోన్-1 లో పని
చేస్తూ ఉండిన చివరి వ్యక్తి కంటే దిగువన నియమింప బడిన 16 మంది ఏ ఈ ఈ లు, డి
ఈఈ లు సొంత జోన్ -1 ఏ ఈ ఈ లు, డి ఈఈ ల కంటే ముందే డీఈఈ , ఈ ఈ , ఎస్ ఈ, సీఈ
లుగా ప్రమోషన్ లు ఇచ్చారు. వారి కంటే సీనియర్స్ అయిన వారికి వెంటనే 16 మందికి
సరిగా ప్రమోషన్లు ఇచ్చి 16 మందిలో మొదటి వ్యక్తి ముందు వారిని
పెట్టాలన్నారు. ఎస్సీ, ఎస్టీల సమస్యలను పరిష్కరించుకోడానికి సెక్రెటరియేట్ఎ
స్సీ, ఎస్టీల కు 5 మంది రిటైర్డ్ గెజిటెడ్ అధికారులతో ఒక లైజనింగ్ సెల్ ను
ఏర్పాటు చేయాలని కోరారు.