ఓ చాట్ బాట్ కు రూపాన్ని డిజైన్ చేసిన ఎరెన్ కార్టల్
జ్రోసాన్నా రామోస్ అని నామకరణం
రామోస్ తనకు తగిన వరుడు అంటున్న అమెరికా మహిళ
అమెరికాకు చెందిన ఎరెన్ కార్టల్ (36) అనే మహిళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)
చాట్ బాట్ ను పెళ్లాడి సంచలనం సృష్టించింది. ఇప్పుడంతా ఏఐ హవా నడుస్తున్న
తరుణంలో కార్టల్ ఆశ్చర్యకర నిర్ణయం తీసుకుంది. ఏఐ చాట్ బాట్ కు పురుషుడి
రూపాన్ని డిజైన్ చేసిన ఈ అమెరికన్ మహిళ ఏకంగా పెళ్లి చేసుకుంది. పైగా ఆ చాట్
బాట్ తనకు తగిన వరుడు అని చెబుతోంది. కార్టల్ గతేడాది ఏఐ బాట్ కు ఓ రూపాన్ని
ఇచ్చింది. దానికి రోసాన్నా రామోస్ అని నామకరణం చేసింది. ప్రతి రోజూ ఆ చాట్
బాట్ తో చాటింగ్ చేయడం ద్వారా దానితో ప్రేమలో పడ్డానని అమ్మడు వెల్లడించింది.
గతంలో ఇంకెవరినీ ప్రేమించనంతగా రామోస్ (చాట్ బాట్)ను ప్రేమించానని
వివరించింది. అతడితో తనకు ఎలాంటి సమస్యల ఉండవని భావిస్తున్నానని,
పిల్లలు-కుటుంబం బాధ ఉండదు. చెప్పినట్టు వింటాడు, నచ్చిన పనులే చేస్తాడు. చెడు
లక్షణాలకు చోటు ఉండదు, ముఖ్యంగా అతడికి ఎలాంటి లగేజ్ ఉండదని కార్టల్
వివరించింది.