ఏకనా స్టేడియం పిచ్ వివాదానికి భారత టీ 20 వైస్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
మంగళవారం చెక్ పెట్టాడు. మనలో ఆడే దమ్ముండాలి గానీ పిచ్ ఎలా ఉంటే ఏమిటని
టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ప్రశ్నించాడు. పిచ్ ఎలా ఉన్నా..
సవాల్‌ను స్వీకరించి పరిస్థితులకు తగ్గట్లు ఆడాలన్నాడు. న్యూజిలాండ్‌తో లక్నో
వేదికగా జరిగిన రెండో టీ20 పిచ్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమైన విషయం
తెలిసిందే. పూర్తిగా స్పిన్‌కు సహకరించిన ఈ వికెట్‌పై ఇరు జట్లు 100 పరుగులు
చేయడానికే ఇబ్బంది పడ్డాయి. రెండు ఇన్నింగ్స్‌ల్లో ఒక్క సిక్స్ కూడా నమోదు
కాలేదు. మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా సైతం పిచ్‌పై
అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇదో షాకింగ్ పిచ్ అని తెలిపాడు. ఈ విమర్శల
నేపథ్యంలో లక్నో క్యూరేటర్పై వేటు పడింది.
ఈ క్రమంలో అహ్మదాబాద్ వేదికగా బుధవారం జరగనున్న చివరి టీ20 నేపథ్యంలో
మీడియాతో మాట్లాడిన సూర్యకుమార్ యాదవ్‌ను పిచ్ గురించి ప్రశ్నించగా ఆసక్తికర
వ్యాఖ్యలు చేశాడు. ‘ఎర్ర నేలా? నల్ల నేలా? అనేది ముఖ్యం కాదు. ఎలాంటి పిచ్‌పై
ఆడుతున్నామనేది మన చేతుల్లో ఉండదు. గత మ్యాచుల్లా పరిస్థితులను
అందిపుచ్చుకోవడం ఆటగాళ్ల చేతిలో ఉంటుంది. లక్నో మ్యాచ్ లో-స్కోరింగ్ గేమ్
అయినా అసలు సిసలు మజా లభించింది. టీ20, వన్డే మ్యాచ్ ఏదైనా ఇరు జట్ల మధ్య
తీవ్ర పోటీ ఉన్నప్పుడే అసలు మజా లభిస్తుంది. వికెట్ ఎలా ఉందనేది పెద్ద విషయమే
కాదు. సవాల్‌ను స్వీకరించి ముందుకు సాగడమే ముఖ్యం.’అని సూర్య పేర్కొన్నాడు.