హాలీవుడ్ యాక్టర్ అలెక్ బాల్డ్ విన్, హిలేరియా బాల్డ్ విన్ దంపతులు తమ ఏడవ బిడ్డను ఆశిస్తున్నారు. ఎమోషనల్ వీడియోను పంచుకోవడం ద్వారా తమ పుట్టబోయే బిడ్డ లింగాన్ని ప్రకటించడానికి ఈ జంట ఇన్స్టాగ్రామ్లోకి వెళ్లింది. ఈ ఏడాది చివరికల్లా తమకు ఆడపిల్ల పుట్టబోతోందని వారు ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. 64 సంవత్సరాల అలెక్ బాల్డ్ విన్ ఇప్పటికే ఆరుగురు సంతానాన్ని కలిగి ఉన్నాడు. భార్య హిలారియా, పిల్లలతో కలసి ఇన్స్టాగ్రామ్ లో వీడియోను పోస్ట్ చేశాడు.