విజయవాడ : ప్రభుత్వం నుండి ఉద్యోగ,ఉపాధ్య,కార్మిక,రిటైర్డు,కాంట్రాక్టు, ఔట్
సొర్శింగు ఉద్యోగులకు సంబందించిన ఆర్థిక, ఆర్దికేతర సమస్యల సాధన
కోసం,ఉద్యోగులు న్యాయమైన డిమాండ్లు పరిష్కారం కోసం కొనసాగుతున్న ఈ పోరాటం లో
ఉద్యోగుల సమస్యలు పరిష్కారం పై ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ వచ్చేంతవరకు ఈ
ఆందోళనా కార్యక్రమాలను కొనసాగిస్తామని ఏపిజెఏసి అమరావతి స్టేట్ చైర్మన్
బొప్పరాజు వెంకటేశ్వర్లు, జెనరల్ సెక్రటిరీ పలిశెట్టి దామోదరరావు
తెలిపారు. మంగళవారం ఏపిజెఏసి అమరావతి రాష్ట్రకమిటి పిలుపునిచ్చిన ఆందోళణా
కార్యక్రమాలలో బాగంగా జరుగుతున్న నల్లబ్యాడ్జీల నిరసన కార్యక్రమాలును జయప్రధం
చేయాలని ఉద్యోగులవద్దకే వెళ్లి విజ్ఞప్తి చేసేకార్యక్రమంలో బాగంగా డైరెక్టరేట్
ఆఫ్ హెల్తు డిపార్టు మెషటు ఆఫీను,ప్లానింగు డిపార్టుమెంటు హెడ్ ఆఫీసు, కమీషనర్
ఆఫ్ ఎండోమెంటు హెడ్ ఆఫీను, ఇంజనీర్ ఇన్ ఛీఫ్ హెడ్ ఆఫీసులలో ప్రతిఉద్యోగిని
కలసి ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను,రావల్సిన భకాయిలను,ఉద్యోగులకు
సంబందించిన డబ్బులు ప్రభుత్వం వాడు కొని చెల్లించకుండా పెడుతున్న ఇబ్బందులు
గుర్చి, పిఆర్శీ బకాయిలు పైన,కొత్త పాత డిఏ బకాయిలు, కొత్త డిఏ చెల్లింపులపై,
లీవ్ ఎన్ క్యాష్ మెంటు, మెడికిల్ రీయింబర్స్ మెంట్లు రాక పడుతున్న ఇబ్బందులను,
సిపియస్ కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్ఛిన హామీ అమలు చేయకపోవడం,ఔట్
సోర్సింగు ఉద్యోగుల జీతాలు పెంపు గూర్చి చివరికి మన జీతాలు, పెన్షన్లు కూడా
ఒకటవతేదీ వేయకుండా ఈ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతున్న కారణంగా ఏపిజెఏసి అమరావతి
రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం మేరకు ఉద్యమకార్యచరణను ప్రారంబించామని ఈ
ఉద్యమానికి యూనియన్లు అసోసియేషన్లకు అతీతంగా అందరు మద్దతు పలికి ఉద్యోగుల
సమస్యల పరిష్కారం చేస్తున్న ఈ ఉద్యమానికి మద్దతు పలకాలని బొప్పరాజు ఉద్యోగులను
విజ్ఞప్తి చేసారు. ఈ ఉద్యమకార్యచరణలో బాగంగా ఈ నెలాఖరు వరకు ఏపిజెఏసి అమరావతి
ఆద్వర్యంలో చేపట్టదలచిన మార్చి 9 నుండి ఏప్రిల్ 5వ తేదీ వరకు నల్ల బ్యాడ్జీలతో
నిరసనలు, ఈనెల 17, 20 తేదిలలో (రెండు రోజులు) ఉద్యమానికి మద్దతు కోరుతూ
రాష్ట్ర వ్యాప్తంగా అన్నీ ప్రభుత్వ కార్యాలయాల సందర్శన, ఈనెల 21 నుండి
రాష్ట్రవ్యాప్తంగా అందరూ ఉద్యోగులు వర్కుటూరూల్, 27వ తేదీన కారుణ్య నియామకాలు
పొందని కుటుంబాల ఇండ్ల సందర్శన తదితర ఆందోళనా కార్యక్రమాలు గూర్చి ఉద్యోగులకు
వివరించి అందరూ స్వచ్చందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని జయప్రదం చేయాలని
బొప్పరాజు, దామోదరరావు విజ్ఞప్తి చేస్తూ అందరికీ అవగాహన కల్పించటం జరిగింది.
అప్పటికి మాన న్యాయమైన ఆర్ధిక, అర్ధికేతర సమస్యలపై ప్రభుత్వం స్పందించీ
పరిష్కరించక పోతే ఏఫ్రిల్ 5 న జరగబోవు రాష్ట్రకార్యవర్గసమావేశంలో భవిష్యత్
కార్యచరణను ప్రకటిస్తామని వారు తెలిపారు.