న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ రాష్టానికి తెలంగాణ ఇవ్వాల్సిన విద్యుత్ బకాయిలను
ఆర్బీఐ ద్వారా ఇప్పిస్తామని కేంద్రం వెల్లడించింది. రాజ్యసభలో ఎంపీలు
విజయసాయి రెడ్డి, జీవీఎల్ నరసింహారావు ప్రశ్నకు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి
ఆర్కే సింగ్ సమాధానం చెప్పారు. రూ. 6 వేల కోట్ల పైచిలుకు విద్యుత్ బకాయిలను
తెలంగాణ నుంచి ఇప్పించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ అంశంపై కేంద్ర
న్యాయశాఖ, ఆర్థిక శాఖతో చర్చిస్తున్నామని తెలిపారు. ఆర్బీఐలో తెలంగాణ
ప్రభుత్వ ఖాతా నుంచి ఈ బకాయిల మొత్తాన్ని చెల్లింపచేసేందుకు
ప్రయత్నిస్తున్నామన్నారు కేంద్ర మంత్రి. విభజన సమయంలో తెలంగాణకు ఏపీ
విద్యుత్తు సరాఫరా చేసిందని, కానీ తెలంగాణ నుంచి చెల్లింపులు జరగలేదని
పేర్కొన్నారు. బకాయిలను వెంటనే చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం తెలంగాణను
ఆదేశించిందని, అయితే రాష్ట్ర సర్కార్ కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకుందని
చెప్పారు. ఇప్పుడు ఆ స్టే గడువు తీరిందని, అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం
చెల్లింపులకు ముందుకు రావడం లేదని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ వద్ద ఉన్న
తెలంగాణ ఖాతా నుంచి బకాయిలను ఏపీకి ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్నామని,
కేంద్ర న్యాయ శాఖ, ఆర్థిక శాఖ సహకారంతో త్వరలోనే ఏపీ బకాయిలు ఇప్పిస్తామని
వెల్లడించారు.