విశాఖపట్నం: వాయవ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం
కొనసాగుతోంది. ఇది సముద్ర మట్టానికి 5.8 కి.మీ.ల ఎత్తులో విస్తరించింది. దీని
ప్రభావంతో ఆదివారం ఉత్తర కోస్తాలో అనేకచోట్ల, దక్షిణ కోస్తాలో కొన్నిచోట్ల,
రాయలసీమలో ఒకటి, రెండు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని
భారత వాతావరణ శాఖ శనివారం వెల్లడించింది. సోమవారం ఉత్తర, దక్షిణ కోస్తాల్లో
కొన్నిచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలకు ఆస్కారం ఉందని పేర్కొంది.
మరోవైపు ఈ నెల 18 నాటికి వాయవ్య బంగాళాఖాతంలోనే మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే
అవకాశం ఉందని, అదేరోజు నుంచి రాష్ట్రంలో వర్షాలు ఊపందుకునేందుకు అవకాశం
ఉంది.