కాకినాడ : ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (ఏపీడబ్ల్యూజేఎఫ్)
కాకినాడ రూరల్ నియోజకవర్గం అధ్యక్ష కార్యదర్శులుగా సీనియర్ జర్నలిస్ట్ దాసరి
శ్రీనివాస్, ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు రెడ్డి నాయుడు బాబు ఏకగ్రీవంగా
ఎన్నికయ్యారు. వారితోపాటు ఉపాధ్యక్షులుగా పలివెల శ్రీనివాస్(ఇమేజ్ న్యూస్),
జాయింట్ సెక్రటరీగా శీలి లక్ష్మణ్ రావు (ప్రజా వార్త),కోశాధికారిగా పాలిక
మోహన్ కుమార్ (అభయ్),సభ్యులుగా దొండపాటి సుధీర్ కుమార్ (ఈవేళ),
పి.శ్రీనివాస్(సిక్స్ టీవీ),త్రిమూర్తులు(ఈజీ టీవీ),శ్రీనివాస్(ఆంధ్ర
పత్రిక)లను సంఘ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు
కాకినాడ రూరల్ మండలం ఎంపిడిఓ కార్యాలయంలో ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు
వి.నవీన్ రాజ్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు.సమావేశంలో
ముందుగా జర్నలిస్టు ల సంక్షేమమే ధ్యేయంగా ఎన్నో ఏళ్లుగా ఏపీడబ్ల్యూజేఎఫ్
పనిచేస్తుందని సంఘ బలోపేతానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిస్తూ,
సభ్యుల అభిప్రాయాలను, వారు ఎదుర్కొంటున్న సమస్యలను పరిగణనలోకి తీసుకుని వాటిని
పరిష్కరించే దిశగా సంఘం పనిచేస్తుందని నవీన్ రాజ్ తెలిపారు. ఈ సమావేశంలో
ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కోశాధికారి వల్లూరి నానాజీ, సంఘ నాయకులు త్రినాథ్,
ధర్మరాజు, కాకినాడ రూరల్ మండల సీనియర్ జర్నలిస్ట్ లు ప్రకాష్, ప్రవీణ్, దైవ,
బిందాన సురేష్, భాస్కర్, ప్రసాద్, కుమార్, అధిక సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొని
నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.