విజయవాడ : ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రూపొందించిన 2023 డైరీని
ప్రెస్ అకాడమి చైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ డైరీని తమ
సంఘ సభ్యులకు అందజేస్తామని తెలిపారు. ఈ సంధర్బంగా జర్నలిస్టులకు సంబంధించిన
పలు అంశాలను కొమ్మినేనితో చర్చించారు. ప్రత్యేకించి జర్నలిస్టుల హెల్త్
కార్డు అమలులో ఎదురవుతున్న ఇబ్బందులను యూనియన్ సభ్యులు ప్రెస్ అకాడమి చైర్మన్
దృష్టికి తెచ్చారు. దీనిపై ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈవోని కలసి ఈ విషయమై
చర్చించి సానుకూలంగా సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తామని కొమ్మినేని హామీ
ఇచ్చారు.ప్రెస్ అకాడమి, విజయవాడ కార్యాలయంలో జరిగిన డైరీ ఆవిష్కరణ
కార్యక్రమంలో ప్రెస్ అకాడమి కార్యదర్శి మామిడి పల్లి బాల గంగాధర తిలక్,
చిత్రంలో ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ వెంకట్రావ్, రాష్ట్ర నాయకులు బి
గోరంట్లప్ప, విజయవాడ నగర అధ్యక్షకార్యదర్శులు కలిమిశ్రీ, ఎం. బీ నాథన్,
కోశాధికారి శ్రీనివాసరావు,నాయకులు రాఘవేంద్ర శేఖర్ తదితరులు పాల్గొన్నారు.