టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్
గుంటూరు : ఏపీలో ఎమర్జెన్సీ విధించారా.. వైసీపీ పోలీసులతో కుప్పంపై ఏకంగా
అప్రకటిత యుద్ధమే ప్రకటించారు.. అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా
లోకేశ్ ట్విటర్ వేదికగా ధ్వజమెత్తారు. ‘‘బ్రిటిష్ చట్టానికి బూజు దులిపి
అర్థరాత్రి జీవో ఇస్తావు. తెల్లారేసరికి ఉల్లంఘిస్తావు. చట్టం మీ యెదుగూరి
సందింటికి ఎదురింటి చుట్టమా? ప్రతిపక్ష నేత చంద్రబాబు తన నియోజకవర్గంలో
పర్యటించేందుకు మీ ఆంక్షలేంటి? మీ కుతంత్రాలన్నీ కుప్పంలో ప్రయోగిస్తున్నారు..
ఎన్ని కుట్రలు చేసినా వైసీపీ నేతలు చంద్రబాబు కుప్పం పర్యటన ఆపలేరు’’ అని
ట్వీట్ చేశారు.