విజయవాడ: అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ కసరత్తు ప్రారంభించింది. అభ్యర్థుల ఎంపిక కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. ఆశావహులు విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌కు దరఖాస్తులు అందించారు. మడకశిర నుంచి సుధాకర్, గుంటూరు తూర్పు నుంచి మస్తాన్ వలీ, బద్వేల్ నుంచి కమలమ్మ సమర్పించారు. పార్టీ తరపున పోటీ చేయాలనుకునే నాయకులు, కార్యకర్తలు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని మాణికం ఠాగూర్ తెలిపారు. ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీ సూచనల మేరకు అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ తర్వలోనే ఏపీలో పర్యటిస్తుందని చెప్పారు. భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పనిచేసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందన్నారు.