గుంటూరు : ఏపీ ప్రభుత్వం తీరుపై కేంద్ర మంత్రి భారతీ పవార్ అసంతృప్తి వ్యక్తం
చేశారు. 60శాతం నిధులు కేంద్రం ఇస్తున్నా ఆ పథకాలకు సైతం ప్రధాని ఫొటో
వేయకుండా రాష్ట్ర ప్రభుత్వమే ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. కేంద్ర
ప్రభుత్వ పథకాలకు సైతం ప్రధాని ఫొటో వేయకుండా ఏపీ ప్రభుత్వం ప్రచారం
చేసుకుంటోందని కేంద్రమంత్రి భారతీ పవార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 60శాతం
నిధులు కేంద్రం ఇస్తున్నా ఏపీ ప్రభుత్వం ఇలా చేయటం ఏం బాగోలేదన్నారు.
గుంటూరులోని హిందూ ఫార్మసీ కాలేజీలో జరిగిన భాజపా జిల్లా బూత్ స్థాయి
కార్యకర్తల శిక్షణా సమావేశానికి కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ
సందర్భంగా మాట్లాడిన భారతీ పవార్ ప్రధాని మోడీ పాలనలో అన్ని వర్గాల
అభివృద్ధి జరుగుతోందన్నారు. సబ్ కా సాథ్..సబ్ కా వికాస్ నినాదాన్ని
కార్యకర్తలే ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. జేపీ నడ్డా మార్గదర్శనంలో
గ్రామ గ్రామానికి బీజేపీ ని తీసుకెళ్తామన్నారు. జిల్లా, మండల స్థాయిల్లో
సమావేశాలు నిర్వహించి కేంద్రం రాష్ట్రానికి ఏం చేస్తుందో వివరిస్తామని
చెప్పారు.