పొత్తులపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు
అసెంబ్లీ ఎన్నికలకు 8 నెలలు ముందుగానే రాజకీయ వాతావరణం వేడెక్కిన
ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి పార్టీల పొత్తులు ఎలా ఉండబోతున్నాయి? బీజేపీ-టీడీపీ
భాగస్వామ్యం మళ్లీ రిపీట్ అవుతుందా?. బీజేపీ-జనసేన మైత్రిలో ఏమైనా మార్పు
ఉంటుందా?. ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షురాలిగా పురంధేశ్వరి నియామకం రాజకీయ
సమీకరణాల్లో మార్పులు తీసుకొస్తుందా? అంటూ రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్న వేళ
ఏపీ బీజేపీ నూతన చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించాక పురంధేశ్వరి స్పష్టమైన
సంకేతాలు ఇచ్చినట్టుగా కనిపిస్తోంది. మీడియాతో ఆమె చేసిన వ్యాఖ్యల ద్వారా ఏపీ
బీజేపీ వైఖరి ఎలా ఉండబోతోందో తేల్చిచెప్పినట్టయ్యింది జనసేన ఎప్పటికీ మిత్ర
పక్షమేనని కుండబద్దలుకొట్టినట్టు తేల్చిచెప్పారు పురంధేశ్వరి. తద్వారా ఇరు
పార్టీల మైత్రిపై అధ్యక్షురాలి హోదాలో స్వయంగా ఆమె క్లారిటీ ఇచ్చారు. జనసేన
అధినేత పవన్‌తో సోమువీర్రాజు మాట్లాడుతూనే ఉండేవారని, అదేవిధంగా జనసేనతో
సమన్వయంతో ముందుకు వెళ్తామని పురంధేశ్వరి అన్నారు. జనసేన తమకు ఎప్పటికీ మిత్ర
పక్షమేనని అన్నారు. తద్వారా జనసేన-బీజేపీ మైత్రి విషయంలో ఎలాంటి మార్పు
ఉండబోదని, ఎన్నికల్లో కూడా కలసి వెళ్లే అవకాశం ఉందన్నట్టుగా క్లారిటీ
ఇచ్చినట్టు పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది.
జనసేన ఎప్పటికీ మిత్ర పక్షమేనని కుండబద్దలుకొట్టినట్టు తేల్చిచెప్పారు.
తద్వారా ఇరు పార్టీల మైత్రిపై అధ్యక్షురాలి హోదాలో స్వయంగా ఆమె క్లారిటీ
ఇచ్చారు. జనసేన అధినేత పవన్‌తో సోమువీర్రాజు మాట్లాడుతూనే ఉండేవారని, జనసేనతో
సమన్వయంతో ముందుకు వెళ్తామని పురంధేశ్వరి చెప్పారు. జనసేన తమకు ఎప్పటికీ మిత్ర
పక్షమేనని అన్నారు. తద్వారా జనసేన-బీజేపీ మైత్రి విషయంలో ఎలాంటి మార్పులు
ఉండబోవని, ఎన్నికల్లో కూడా కలసి వెళ్లే అవకాశం ఉందని క్లారిటీ ఇచ్చారు. మరి
టీడీపీతో మరోసారి జత కడతారా?, ఎన్నికల్లో ఉమ్మడిగా బరిలోకి దిగే అవకాశముందా
అనే విశ్లేషణలు గట్టిగా వినిపిస్తున్న వేళ పొత్తులపై పార్టీ పెద్దలు
చూసుకుంటారని పురంధేశ్వరి తేల్చిచెప్పారు. పరిస్థితులను బట్టి, హైకమాండ్
ఆదేశాలనుసారం ముందుకెళ్లనున్నట్టు పురంధేశ్వరి వెల్లడించారు. మరోవైపు
ప్రజాహితం కోసం కాకుండా తన హితం కోసం సీఎం జగన్ పనిచేస్తున్నారని
తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న వైనంపై
బీజేపీ పనిచేస్తోందని పార్టీ లైన్‌ను క్లియర్ కట్‌గా చెప్పారు. తద్వారా జగన్
సారధ్యంలోని వైసీపీ సర్కారుపై పోరాటం ఉంటుందని పురంధేశ్వరి ఫుల్ క్లారిటీ
ఇచ్చినట్టయ్యిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మేరకు స్పష్టమైన
సంకేతాలిచ్చినట్టయ్యిందని రాజకీయ విశ్లేషణలు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్ర పార్టీ కార్యాలయంలో టీవల బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె
మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ పేదలు, రైతులు, మహిళలు అన్ని వర్గాలనూ
వచించారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పేదల రక్తం, మహిళల పుస్తెలతో తాడేపల్లి
ప్యాలెస్‌లో సొంత ఖజానా నింపుకొంటున్నారని విమర్శించారు. మద్య నిషేధం
మొదలుకొని ప్రతి హామీలోనూ ఆంధ్రులను వంచించారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు
కేంద్రం నిధులు ఇస్తున్నా నిర్మాణం చేయలేకపోతే కేంద్రానికి ప్రాజెక్టు
అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పరిపాలన సాగించే
వారిని గద్దె దించేందుకు బీజేపీ వెనుకాడబోదన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు
పూర్తిగా క్షీణించాయని, అక్కను వేధిస్తోన్న ఆకతాయిలను అడ్డుకున్న బాలుడు
బాపట్లలో నిలువునా దహనమయ్యాడని పురంధేశ్వరి ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు.
స్వర్ణాంధ్రగా చూడాలనుకున్న రాష్ట్రాన్ని విధ్వంసాంధ్రగా చేసిన జగన్
పాలకుడిగా ఉండటానికి ఏ మాత్రం అర్హుడు కాదన్నారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం
ఎన్నో హామీలిచ్చిన వైసీపీ అధ్యక్షుడు సీఎం అయ్యాక ప్రజల్ని అన్నింటా
వంచించారన్నారు. ఇలా ఒకటా రెండా.. ఏపీ ప్రభుత్వం చేస్తున్న తప్పొప్పులను తన
మొదటి ప్రసంగంలోనే ఎత్తి చూపి చెడుగుడు ఆడుకున్నారు. పనిలో పనిగా జనసేనతో
బీజేపీ పొత్తు కంటిన్యూ అవుతుందని.. నిన్న ఉన్నాం.. నేడు ఉన్నాం.. రేపూ
ఉంటామని ఇక ఇతర పార్టీల పొత్తుల విషయంలో తుది నిర్ణయం అధిష్టానమే
చూసుకుంటుందన్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. కేంద్రం ఇచ్చిన నిధులతోనే ప్రభుత్వం
తమ పేరు, ఫోటోలు పెట్టుకొని రాష్ట్రంలో పథకాలు అమలు చేస్తోందని
విమర్శనాస్త్రాలు సంధించారు. సచివాలయాలను కూడా కేంద్ర నిధులతోనే నిర్మించారని,
నాలుగేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రానికి, ప్రజలకు చేసింది ఏమి లేదని, అంతా
కేంద్రమే చేసిందని పురంధేశ్వరి చెప్పుకొచ్చారు.
రియాక్షన్ లేదేం..? : ప్రభుత్వ వైఫల్యాలను పురంధేశ్వరి పిన్ టూ పిన్‌గా
ఎత్తిచూపి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించినప్పటికీ వైసీపీ నుంచి ఒక్కరంటే
ఒక్కరు కూడా స్పందించలేదు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్
కల్యాణ్ ప్రభుత్వం గురించి పల్లెత్తి మాట అన్నా విరుచుకుపడే వైసీపీ నేతలు
పురంధేశ్వరి ఇన్ని మాటలు అన్నా ఎందుకు స్పందించలేదన్నది ఇప్పుడు ఏపీ ప్రజల్లో
మెదులుతున్న ప్రశ్న. ఇప్పటి వరకూ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సోము వీర్రాజు
వైసీపీకి వకల్తా పుచ్చుకున్నట్లు మాట్లాడారే తప్ప వైఎస్ జగన్‌ను ప్రశ్నించిన
సందర్భాల్లేవని సొంత పార్టీ నేతలు చెప్పుకుంటున్న పరిస్థితి. కేంద్రంలో రెండు
సార్లు అధికారంలో ఉన్నప్పటికీ ఏపీలో బీజేపీ పరిస్థితి మాత్రం ఎప్పుడూ ఉనికి
కోసం పోరాటమే కావడంతో ఇక ఇలాగైతే కాదని పురంధేశ్వరిని అధ్యక్షురాలిగా చేసింది
అగ్రనాయకత్వం. బాధ్యతలు చేపట్టాక మొదటి ప్రసంగంతోనే కార్యకర్తల్లో
మునుపెన్నడూలేని జోష్ తెప్పించారు. పురంధేశ్వరి రాకతో వైసీపీలో వణుకు
మొదలైందని, ఆమె సంధించిన ప్రశ్నలు, విమర్శలకు ఒక్కరంటే ఒక్కరూ
స్పందించకపోవడంతో ఎదురుదాడి చేస్తే అసలుకే ఎసరొచ్చిపడుతుందని భయపడినట్లు
రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.