విజయవాడ : తెలుగు రాష్ట్రాల్లో పట్టభద్రులు, ఉపాధ్యాయ, స్థానిక సంస్థల
ఎమ్మెల్సీ ఎన్నికలు మార్చి 13న జరగనున్న సంగతి తెలిసిందే. ఏపీలో 3 పట్టభద్రుల
స్థానాలకు, 9 స్థానిక సంస్థల స్థానాలకు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు
ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో, ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ
ఎన్నికలకు బీజేపీ అభ్యర్థులు ఖరారయ్యారు. కడప-అనంతపురం-కర్నూలు ఎమ్మెల్సీ
స్థానానికి నగరూరు రాఘవేంద్ర, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు ఎమ్మెల్సీ స్థానానికి
సన్నారెడ్డి దయాకర్ రెడ్డి… శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం ఎమ్మెల్సీ
స్థానానికి పీవీఎన్ మాధవ్ ను బీజేపీ నాయకత్వం అభ్యర్థులుగా ఎంపిక చేసింది.
తెలుగు రాష్ట్రాల్లోని ఎమ్మెల్సీల పదవీకాలం మార్చి 29తో ముగుస్తుండడంతో,
ఎన్నికల సంఘం ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో, త్వరలోనే స్థానిక
సంస్థలు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు కూడా అభ్యర్థులను ఎంపిక చేసేందుకు
బీజేపీ కసరత్తులు చేస్తోంది.