విజయవాడ : ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలకు పెట్టుబడులు పెట్టమని జగన్ ప్రభుత్వం
సమావేశాలు ఏర్పాటు చేసి వారికి విన్నపించడం పెద్ద బూటకమని ఏపిసిసి ముఖ్య
అధికార ప్రతినిధి డా.ఎన్.తులసిరెడ్డి కొట్టిపారేశారు. విజయవాడలోని ఆంధ్ర రత్న
భవన్ నందు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ విశాఖలో జరిగిన
పారిశ్రామిక సదస్సులో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పిన విషయాలు చాల
విడ్డూరంగా, హాస్యాస్పదంగా ఉన్నాయని అవహేళన చేసారు. నాలుగేళ్లుగా గోళ్లు
గిల్లుకుంటూ కూర్చుని యువతకు ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయాయని అంటూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము జగన్ పరిపాలన వాళ్ళ ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుందని
ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల గురించి
తులసిరెడ్డి ప్రస్తావించారు. విలేకరుల సమావేశంలో ఎపిసిసి లీగల్ సెల్ చైర్మన్
వి.గురునాధం, ఆర్టీఐ సెల్ చైర్మన్ పి.వై.కిరణ్, సంజీవ రెడ్డి, తుళ్లూరు మండల
అధ్యక్షులు కొమ్మినేని సురేష్ తదితరులు పాల్గొన్నారు.