గుంటూరు : ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అధ్వానంగా ఉన్నాయని సీపీఎం పొలిట్
బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో నూతనంగా
నిర్మించిన తేళ్ల నారాయణ విజ్ఞన కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా
రాఘవులు మాట్లాడుతూ అమరావతిలో కత్తులు దూసుకుంటున్నారని, విశాఖపట్నం కబ్జాల
కేంద్రంగా మారిందని విమర్శించారు. టీడీపీ హయాంలో చేయలేని పనులు మెడకు
చుట్టుకున్నాయన్నారు. శాసనసభ భవనాలు శాశ్వతంగా నిర్మిస్తే 3 రాజధానుల పంచాయితీ
ఉండేది కాదన్నారు. కార్యక్రమంలో విజ్ఞాన్ విద్యాసంస్థల అధినేత లావు రత్తయ్య,
కేఎస్ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.