గ్లోబల్ ఈ-కామర్స్ లో అడుగుపెట్టిన పల్స్ ప్లష్
లాంచనంగా ప్రారంభించిన రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్
విశాఖపట్నం : రాష్ట్రంలో వెయ్యి ఎకరాలలో టాయ్ పార్క్ఏర్పాటు చేయడానికి
ప్రతిపాదనలు వచ్చాయని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో సంప్రదించి త్వరలోనే
దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్
తెలియజేశారు. గాజువాక గ్రీన్ సిటీ లో ఉన్న పల్స్ ప్లష్ బొమ్మల కంపెనీ డిస్నీ,
వాల్మార్ట్, టెస్కో, హాస్బ్రో, స్పిన్ మాస్టర్ తదితర వ్యాపార సంస్థల ద్వారా
న్యూయార్క్ ఫ్లోరిడా,శాన్ ఫ్రాన్సిస్కోతో పాటు యూఎస్ లోని మరిన్ని నగరాలకు తమ
బొమ్మలను ఎగుమతులు చేసేందుకు వీలుగా గ్లోబల్ ఈ-కామర్స్ ను శుక్రవారం మంత్రి
అమర్నాథ్ లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇటీవల తాను శ్రీ
సిటీలో పర్యటించినప్పుడు దేశంలో బొమ్మల మార్కెట్ ఉన్న ప్రాధాన్య ఏమిటో
తెలిసిందని దేశవ్యాప్తంగా ఏడాదికి ఏడు నుంచి 8 లక్షల కోట్ల రూపాయల విలువైన
బొమ్మల విక్రయాలు జరుగుతున్నాయని మంత్రి ఎమన్నా తెలియజేశారు. బొమ్మల తయారీలో
చైనా అగ్రస్థానంలో ఉందని, త్వరలోనే ఆంధ్రప్రదేశ్ టాయ్స్ ఎక్స్పోర్ట్ హబ్ గా
మారనుందని ఆయన తెలియజేశారు. ఏపీలో టాయ్ పార్క్ ఏర్పాటు చేయడం వలన 30 నుంచి 40
వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయనిఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచ
స్థాయిలో బొమ్మల ఎగుమతికి తనకెంతో ఆనందంగా ఉందనిఅమర్నాథ్ చెప్పారు.
ఈ సందర్భంగా పల్స్ ప్లష్ ప్రైవేట్ ఇండియా లిమిటెడ్ సంస్థ ప్రెసిడెంట్ అజయ్
సిన్హా మాట్లాడుతూ బొమ్మలు తయారీ పై తనకు మక్కువ ఎక్కువ అని సుమారు 30
సంవత్సరాల నుంచి తాను ఈరంగంలో దేశ ,విదేశాల్లోని అనేక సంస్థలలో కీలక బాధ్యతలు
పోషించానని చెప్పారు. 1995లో నోయిడాలో బొమ్మలను తయారు చేశామని అప్పట్లో
దేశంలో డిస్నీ లైసెన్స్ తన సంస్థకు మాత్రమే ఉండేదని తెలిపారు. 1997 నుంచి 2000
సంవత్సరం వరకు తమ సంస్థ తయారుచేసిన బొమ్మలని తైవాన్, సౌత్ కొరియా తదితర
దేశాలకు ఎగుమతి చేశామని చెప్పారు. నాణ్యతతో కూడిన బొమ్మలను తయారుచేయాలన్నదే తన
లక్ష్యమని అయితే ఆ సమయంలో ముడి సరుకు సమస్య ఎదుర్కోవలసి వచ్చిందని అన్నారు.
ఎన్ని కష్టనష్టాలు వచ్చినా నాణ్యమైన బొమ్మల తయారీలో వెనుకడుగు వేయకూడదన్న
లక్ష్యం ఒకపక్క, చైనా బొమ్మలకు దీటుగా భారతదేశ అత్యంత నాణ్యమైన ప్రమాదరహితమైన
బొమ్మలు తయారుచేసి మార్కెట్లోకి తేవాలన్న సంకల్పంతో తాను రెండువేల 2011-12
మధ్య తిరుపతి దగ్గర ఉన్న శ్రీ సిటీలో పల్స్ ప్లష్ బొమ్మల తయారీకి శ్రీకారం
చుట్టానని చెప్పారు. శ్రీ సిటీలో కేవలం ఐదు ఎకరాల్లో ఏర్పాటు చేసిన పరిశ్రమలో
ఎగుమతులకు అనువైన బొమ్మల తయారు చేస్తున్నామని అజయ్ సిన్హా తెలియజేశారు. ఆ
తర్వాత కాకినాడలో 300 ఎకరాల్లో పల్స్ ప్లష్ బొమ్మల తయారీ పెద్ద ఎత్తున
జరుగుతున్న నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఫార్మ కంపెనీలు పెద్ద ఎత్తున రావడంతో తమ
కార్యకలాపాలను విశాఖపట్నం, నగరికి మార్చుకున్నామని అజయ్ సిన్హా తెలియజేశారు.
విశాఖలో ప్రస్తుతం నడుస్తున్న తమ కంపెనీని మరింతగా విస్తరించినందుకు రాష్ట్ర
ప్రభుత్వ సహాయ సహకారాల కోసం ఎదురు చూస్తున్నామని ఆయన తెలియజేశారు. ప్రస్తుతం
విశాఖలో తయారవుతున్న బొమ్మలను స్వదేశీయులేకాకుండా, విదేశాలలో ఉన్న చిన్నారులకు
గ్లోబల్ ఈ-కామర్స్ లోని డిస్నీ, వాల్మార్ట్, టెస్కో, హాస్బ్రో, స్పిన్
మాస్టర్ తదితర వ్యాపార సంస్థల ద్వారా న్యూయార్క్ ఫ్లోరిడా,శాన్ ఫ్రాన్సిస్కోతో
పాటు యూఎస్ లోని మరిన్ని నగరాలకు తమ బొమ్మలను విక్రయించేందుకు ఏర్పాట్లు
చేస్తున్నామని చెప్పారు.