జగనన్న చిత్తశుద్ధి ఫలితంగానే ఏపీకి అవార్డులు
రూ.16వేల కోట్లతో వైద్య ఆరోగ్య రంగాన్ని బలోపేతం చేస్తున్నాం
ఆరోగ్య ఆసరా లాంటి పథకాలతో చరిత్ర సృష్టించాం
ఆరోగ్యశ్రీ ద్వారా నిజమైన హెల్త్ కవరేజి డేను సాధించాం
రాష్ట్ర ప్రభుత్వాల సదస్సులో మంత్రి విడదల రజిని
వారణాసిలో కేంద్ర ప్రభుత్వ సదస్సుకు హాజరు
తొలి రోజు టెలీ కన్సల్టేషన్ అంశంలో అవార్డు అందుకున్న మంత్రి
వెలగపూడి : ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఆలోచనల ఫలితంగా
ఆంధ్రప్రదేశ్‌లో వైద్య రంగంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా, భవిష్యత్తులోనూ
సాధ్యం కాదనేలా విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని రాష్ట్ర వైద్య
ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం
ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలో యూనివర్సల్ హెల్త్
కవరేజి డే వేడుకలను శనివారం ప్రారంభించారు. కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ
మంత్రితోపాటు దేశంలోని ఆయా రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ మంత్రులంతా
హాజరయ్యారు. ఈ వేడుకల్లో భాగంగా మూడు అంశాల్లో రాష్ట్రాలకు కేంద్రం
అవార్డులు ప్రకటించగా ఏకంగా రెండు అంశాల్లో ఏపీ బహుమతులు గెలుచుకుంది.
కేంద్రవైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ మన్సూక్ మాండవీయ చేతుల మీదుగా
టెలీకన్సల్టేషన్ విభాగంలో ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని,
వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు అవార్డు అందుకున్నారు.
విలేజ్ హెల్త్ క్లినిక్‌ల అంశానికి ఆదివారం మరో అవార్డు ఏపీ ప్రభుత్వం
అందుకోనుంది. ఈ వేడుకల్లో భాగంగా మంత్రి విడదల రజిని మంత్రుల
చర్చాగోష్టిలో పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్
ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ – 15 వ ఆర్థిక సంఘం నిధులు అనే అంశంపై మంత్రుల
చర్చాగోష్టి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి విడదల రజిని
మాట్లాడుతూ ఏపీలో వైద్య ఆరోగ్యరంగంలో అమలుచేస్తున్న సంస్కరణలకు జాతీయ,
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తున్నదని చెప్పారు. తాజాగా వారణాసిలో
కేంద్రప్రభుత్వం నిర్వహించిన యూనివర్సల్ హెల్త్ కవరేజి డే వేడుకుల్లోనూ
రెండు విభాగాల్లో అవార్డులు దక్కడం గర్వకారణమని చెప్పారు. కేంద్ర
ప్రభుత్వం కేవలం మూడు విభాగాల్లోనే అవార్డులు ప్రకటించగా.. ఏకంగా రెండు
విభాగాల్లో ఏపీకి బహుమతులు దక్కడం ముఖ్యమంత్రి వైఎస్ జగన్
మోహన్‌రెడ్డి చిత్తశుద్ధికి నిదర్శనమని చెప్పారు. ఏపీ ప్రభుత్వం పేదలకు
మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎంతో కృషి చేస్తున్నదని, కేంద్ర
ప్రభుత్వం, ఇతర రాష్ట్రాలు కూడా ఏపీని ఎంతో మెచ్చుకుంటున్నాయని
వివరించారు. ఏపీలో మెడికల్ కళాశాలల నిర్మాణం, క్యాన్సర్, కిడ్నీ వ్యాధి
కి చికిత్స అందించే విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ కూడా ఉండాలని
ఆకాంక్షించారు.
రూ.16వేల కోట్లతో వసతులు : తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి
నాయకత్వంలో వైద్య ఆరోగ్యశాఖను ఎంతో బలోపేతం చేస్తున్నామని మంత్రి
విడదల రజిని తెలిపారు. ఇందుకోసం ఏకంగా రూ.16వేల కోట్ల కుపైగా నిధులు ఖర్చు
చేస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి 5వేల మంది జనాభాకు ఒక
సబ్ సెంటర్ అందుబాటులో ఉండాలనే విధానాన్ని అనుసరిస్తుండగా తమ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ప్రతి 2వేల జనాభాకు ఒక ఒకటి
చొప్పున హెల్త్ క్లినిక్ ఉండాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని
పేర్కొన్నారు. పేదలందరికీ మెరుగైన వైద్యం వారి సొంత ఊరిలోనే అందాలనే
లక్ష్యం, గ్రామీణ వైద్య విభాగాన్ని మరింత బలోపేతం చేయాలనే ఆశయం తమ
నాయకుడు జగనన్నకు ఉండటం వల్ల రాష్ట్రంలో మూడేళ్లలోనే ఏకంగా 10,032
వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ వైఎస్సార్
విలేజ్ క్లినిక్ ల ద్వారా 14 రకాల వైద్య పరీక్షలు, 67 రకాల మందులు పూర్తి
ఉచితంగా తమ ప్రభుత్వమే అందిస్తున్నదని వెల్లడించారు. తమ ప్రభుత్వం
పేదలకు టెలీ మెడిసిన్ సర్వీసెస్ ద్వారా ఉచితంగా స్పెషలిస్టు వైద్య సేవలను
అందిస్తున్నదని చెప్పారు. తమ రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ చిత్తశుద్ధితో
పనిచేస్తున్న ఫలితంగానే ఇప్పుడు రోజూ 60 వేల టెలీ మెడిసిన్ కాల్స్ తమకు
వస్తున్నాయని పేర్కొన్నారు.
ఎక్కడా లేని విధంగా ఏపీలో ఫ్యామిలీ ఫిజిషియన్ వైద్య విధానం : ఈ దేశ
చరిత్రలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయని విధంగా తమ నాయకుడు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఫ్యామిలీ ఫిజిషియన్ వైద్య
విధానాన్ని తమ రాష్ట్రంలో తీసుకొచ్చారని పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా 104
వాహనం అన్ని గ్రామాలకు వైద్య సిబ్బంది, పరికరాలు, మందులతో సహా
వెళుతున్నదన్నారు. ఎంబీబీఎస్ డాక్టర్ కూడా ఈ బృందంలో ఉంటారని
వెల్లడించారు. దీనివల్ల గ్రామీణులకు వారి గ్రామంలోనే ఉచితంగా ఓపీ సేవలు,
వైద్య పరీక్షలు, మందులు అందుతున్నాయని పేర్కొన్నారు. ఇంటింటికీ వెళ్లి
రోగులకు వైద్య సేవలు అందించే వెసులుబాటు ఈ నూతన విధానం ద్వారా తమ
రాష్ట్రంలో ప్రజలకు కలుగుతోందని వెల్లడించారు. ప్రాథమిక ఆరోగ్య
రంగాన్ని బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వం ఏకంగా రూ.2750 కోట్లు ఖర్చు
చేస్తున్నదని తెలిపారు. సెకండరీ వైద్య విభాగం బలోపేతం కోసం తమ సీఎం ఏకంగా
రూ.1223 కోట్లు ఖర్చు చేస్తున్నారని చెప్పారు. టెర్షియరీ వైద్య విభాగాన్ని
గతంలో కనీవిని ఎరుగని విధంగా తీర్చిదిద్దుతున్నామని, అందుకోసం ఏకంగా
రూ.12500 కోట్లు ఖర్చు చేస్తున్నామని వివరించారు.