విజయవాడ : ఆంధ్రప్రదేశ్ లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి రావడమే
లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని వర్కింగ్ ప్రెసిడెంట్లా సమీక్ష
సమావేశంలో ఏఐసిసి కార్యదర్శులు మయప్పన్, క్రిష్టాఫర్ తిలక్, ఏపీ సి సి
అధ్యక్షులు గిడుగు రుద్రరాజు తెలిపారు. విజయవాడ ఆంధ్రరత్న భవన్ లో జరిగిన
వర్కింగ్ ప్రెసిడెంట్ సమీక్ష సమావేశంలో గిడుగు రుద్రరాజుతో కలిసి ఎఐసిసి
కార్యదర్శులు పార్టీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో
వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలి, సుంకర పద్మశ్రీ, జంగా గౌతమ్ , రాకేష్
రెడ్డి తో పాటు సోషల్ మీడియా కమిటీ చైర్మన్ రాకేష్, సభ్యులు ఈ సమీక్షలో
పాల్గొన్నారు. గత ఏడు నెలలుగా అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పార్టీ బలోపేతానికి
పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారని, రాష్ట్రంలోని జిల్లాల పర్యటనలు, పాదయాత్ర,
బహిరంగ సభ నిర్వహించి పార్టీ శ్రేనులను ఉత్సాహపరిచి కార్యకర్తలలో చైతన్యం
తీసుకొచ్చారని ఏఐసీసీ కార్యదర్శులు గిడుగు రుద్రరాజను అభినందించారు. అమెరికాలో
రాహుల్ గాంధీ పర్యటన విజయవంతం అవడంలో రుద్రరాజు పాత్ర, ప్రవాస భారతీయులను
ఏకతాటిపై తీసుకువచ్చి సభ నిర్వహణలు రుద్రరాజు పార్టీ కోసం చేస్తున్న అవిశ్రాంత
కృషి ప్రశంసనీయమైందన్నారు. వివిధ నియోజకవర్గాల్లో సమన్వయ కర్తలనియామకం
పూర్తయిందని, పిసిసి కార్యవర్గం జిల్లా అధ్యక్షుల మార్పు వంటి అంశాల గురించి
చర్చించారు. అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, ఏఐసీసీ కార్యదర్శులు మయప్పన్,
క్రిష్ణాఫర్ తిలక్ లు జరిగిన సమీక్షా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం,
పార్టీ చేరికల గురించి చర్చించారు.