అగ్రికల్చర్ 89.65 శాతం మంది ఉత్తీర్ణత
హాజరైన వారిలో 76.32శాతం మంది ఉత్తీర్ణత
త్వరలోనే కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తాం
ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ
విజయవాడ : ఏపీ ఈఏపీసెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం
విజయవాడలో విడుదల చేశారు. ఇంజినీరింగ్ విభాగంలో 1,71,514 మంది (76.32 శాతం),
అగ్రికల్చర్లో 81,203 మంది (89.65 శాతం) ప్రవేశాలకు అర్హత సాధించారు.
టాపర్లు వీళ్లే : ఇంజినీరింగ్ విభాగంలో ఉమేశ్ వరుణ్ (నందిగామ) మొదటి
స్థానంలో నిలవగా అభినవ్ చౌదరి (హైదరాబాద్) రెండో స్థానంలో, సాయిదుర్గారెడ్డి
(పిడుగురాళ్ల) మూడో ర్యాంకు, బాబు సుజన్‌రెడ్డి (తిరుపతి) నాలుగో ర్యాంకు,
వెంకట యుగేశ్ (రాజంపేట) ఐదో స్థానం దక్కించుకున్నారు. అగ్రికల్చర్ విభాగంలో
సత్యరాజ జశ్వంత్ (కాతేరు) మొదటి ర్యాంకు సాధించగా వరుణ్ చక్రవర్తి
(శ్రీకాకుళం) రెండో ర్యాంకు, రాజ్‌కుమార్ (సికింద్రాబాద్) మూడో ర్యాంకు,
సాయి అభినవ్ (చిత్తూరు) నాలుగో ర్యాంకు, కార్తికేయరెడ్డి (తెనాలి)కి ఐదో
ర్యాంకు వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ ఈఏపీ సెట్ ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు.
విజయవాడలో జరిగిన కార్యక్రమంలో మంత్రి ఫలితాలను విడుదల చేశారు. ఈఏపీ సెట్
నిర్వహించిన జేఎన్టీయూ అనంతపురం అధికారులను మంత్రి బొత్స అభినందించారు.
మార్చి 10న నోటిఫికేషన్ జారీ చేసినట్లు చెప్పారు. ఈఏపీ సెట్ పరీక్షలకు ఈ
ఏడాది 3,38,739మంది దరఖాస్తు చేసుకున్నారని, ఇంజనీరింగ్ పరీక్షలకు 2.38 లక్షల
మంది, అగ్రికల్చర్ విభాగంలో 1,00,559 మంది దరఖాస్తు చేశారని చెప్పారు.
ఇంజనీరింగ్, ఫార్మా విభాగంలో 2,38,180మంది దరఖాస్తు చేసుకుంటే 2,24,724మంది
పరీక్షలకు హాజరయ్యారని వారిలో 1,71,514మంది అర్హత సాధించినట్లు
చెప్పారు.మొత్తం హాజరైన వారిలో 76.32శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు
చెప్పారు. అగ్రికల్చర్ విభాగంలో 1,00,559మంది దరఖాస్తు చేస్తే 90,573మంది
పరీక్షలకు హాజరయ్యారని వారిలో 81203మంది అర్హత సాధించినట్లు చెప్పారు.అగ్రి
విభాగంలో 89.65శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి బొత్స వివరించారు.*
ఇంజనీరింగ్/ఫార్మసీ విభాగంలో మొదటి ర్యాంకును ఎన్టీఆర్ జిల్లాకు చెందిన చల్లా
ఉమేష్ వరుణ్ సాధించాడు. నార్మలైజేషన్లో 158.0313 మార్కులు సాధించాడు. రెండో
ర్యాంకును హైదరాబాద్‌కు చెందిన బిక్కిన అభినవ్ చౌదరి 157.2624 మార్కులో
దక్కించుకున్నాడు. మూడో ర్యాంకును పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన
నందిపాటి సాయిదుర్గారెడ్డి 155.2980మార్కులతో సాధించారు. నాలుగో ర్యాంకును
తిరుపతికి చెందిన చింతపర్తి బాబు సంజీవ్ రెడ్డి(155.6847మార్కులు), ఐదో
ర్యాంకును అన్నమయ్య జిల్లాకు చెందిన దుగ్గునేని వెంకట యుగేష్ 154.6556
మార్కులతో సాధించాడు. ఇంజనీరింగ్ ఫార్మా విభాగంలో ఆరో ర్యాంకును చిలకలూరి
పేటకు అడ్డగడ వెంకట శివరామ్ ( 153.9792మార్కులు), ఏడో ర్యాంకును గుంటూరుకు
చెందిన యక్కంటి ఫణి వెంకట మణీంధర్ రెడ్డి( 154.6274 మార్కులు), 8వ ర్యాంకును
అనంతపురంకు చెందిన మేడాపురం లక్ష్మీనారాయణ మాధవ్ భరద్వాజ్ (153.1448మార్కులు),
తొమ్మిదో ర్యాంకును పిన్ను శశాంక్ రెడ్డి 152మార్కులు, పదో ర్యాంకును
తెలంగాణకు చెందిన ఎం.శ్రీకాంత్ 152.8447మార్కులతో దక్కించుకున్నారు.
ఈఏపీసెట్‌లో బాలికలు 96,659మంది దరఖాస్తు చేశారని, అగ్రికల్చర్ లో
71,643మంది బాలికలు దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. దరఖాస్తు చేసిన వారిలో
బాలికలే ఎక్కువ మంది ఉన్నారని చెప్పారు. ఇంజనీరింగ్ 1,40,521మంది బాలికలు
దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. ఇంజనీరింగ్ విభాగంలో మే 15 నుంచి 19వరకు
పరీక్షలు నిర్వహించినట్లు మంత్రి బొత్స చెప్పారు. ఫార్మసీ, అగ్రికల్చర్లో మే
22 నుంచి పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో
25జోన్లలో 136 పరీక్షా కేంద్రాల్లో సెట్ నిర్వహించినట్లు తెలిపారు.
ఇంజనీరింగ్ విభాగంలో దరఖాస్తు చేసిన వారిలో 94శాతం మంది, 1.71లక్షల మంది
అర్హత సాధించినట్లు మంత్రి బొత్స చెప్పారు. ఎంసెట్ ఫలితాల్లో ఇంటర్
మార్కులకు వెయిటేజీ ఇచ్చి ఫలితాలు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే
కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు. ఇంజనీరింగ్‌లో మొత్తం 2,24,724
మందికి గానూ 1,71,514 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. అగ్రికల్చర్లో
90,573 మందికి గానూ, 81,203 మంది అభ్యర్థులు క్వాలిపై అయ్యారు. ఇంజనీరింగ్
విభాగంలో అత్యధిక మార్కులు సాధించిన టాప్ టెన్ జాబితాలో ఈసారి అంతా బాలురే
ఉన్నారు. ఇంజనీరింగ్ విభాగం మొదటి ర్యాంకు158 మార్కులతో ఉమేష్ వరుణ్
అగ్రస్థానంలో ఉన్నారు. తెలంగాణా ఎమ్ సెట్లో కూడా వరుణ్ మూడవ ర్యాంకు
సాధించారు.