అమరావతి : ఏపీలో ఎస్సై ఉద్యోగాలకు నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్ష ఫలితాలు
విడుదలయ్యాయి. ఫలితాలను పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసింది. 411
పోస్టులకు గాను ఫిబ్రవరి 19న రాత పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 1,51, 288
మంది అభ్యర్థులు హాజరుకాగా వారిలో 57,923 మంది అర్హత సాధించారు. అర్హత
మార్కులను ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్లకు 30 శాతం, బీసీలకు 35, ఓసీలకు
40 శాతంగా నిర్ణయించారు. అభ్యర్థుల నుంచి 1,553 అభ్యంతరాలను స్వీకరించినట్లు
రిక్రూట్‌మెంట్‌బోర్డు తెలిపింది. అర్హత సాధించిన అభ్యర్థులు మార్చి 4 ఉదయం 11
గంటల వరకు ఓఎంఆర్ షీట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. రెండు
పేపర్లలో అర్హత సాధించిన వారికే దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు
బోర్డు తెలిపింది.