విజయవాడ : ఆంధ్రప్రదేశ్ సహకార శాఖ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్, అమరావతి
రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు నిర్వహణలో భాగంగా ఆదివారం విజయవాడ సూర్యాపేట నందు
గల సహకార భవన్ నందు నామినేషన్లు స్వీకరణ, ఉపసంహరణ ప్రక్రియ నిర్వహించగా
రాష్ట్ర కమిటీకి పోటీ లేకుండా నామినేషన్లు సమర్పించి ఉన్నందున రాష్ట్ర
కార్యవర్గము కమిటి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి జె.వి సుబ్బరాజు
ప్రకటించారు. టి.వి.ఫణి పేర్రాజు, అధ్యక్షలుగా కె. భావన ఋషి, జనరల్
సెక్రటరీగా, వై.వి. కోటేశ్వరరావు, కోశాధికారిగా మిగిలిన 19 స్థానములో
ఏకగ్రీవముగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా అధ్యక్షుడు టి.వి.ఫణిపేర్రాజు మాట్లాడుతూ జిల్లాల పునర్విభజన
తర్వాత అన్ని జిల్లాల ఎన్నికలు నిర్వహించుకుని రాష్ట్ర కమిటీ బైలా నిబంధనలకు
అనుగుణంగా సాంప్రదాయ పద్ధతుల్లో ఎన్నికల నిర్వహణ జరిగిందని ఐదవ సారి రాష్ట్ర
అధ్యక్ష కార్యదర్శులుగా మమ్మల్ని ఎన్నుకొని మా మీద నమ్మకం ఉంచి ఈ
నిర్వహణకు సహకరించిన సహకార శాఖ ఉద్యోగ నాయకులకు, ఉద్యోగులకు రాష్ట్ర కమిటీ
తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వము నుండి
పెండింగ్ ఉన్న పీఆర్సీ బకాయిలు జిపిఎఫ్, సరెండర్ లీవులు తదితర ఆర్థిక అంశాలపై
ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి ఉందని ఈ విషయమై ఏపీజేఏసీ అమరావతిలో భాగస్వామి
పక్షంగా ప్రభుత్వంతో పోరాడతామని, జిల్లాల పునర్విభజన తర్వాత జిల్లా
కార్యాలయాలలో ఉన్న సిబ్బంది కొరత, కింద స్థాయిలో అనేక సంవత్సరముగా ప్రమోషన్స్
పెండింగ్లో ఉన్న కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తామని తెలియజేశారు.
జనరల్ సెక్రటరీ కె.భావన ఋషి మాట్లాడుతూ నిబంధనలకు అనుకూలంగా బైలా నిభందనలు
సవరణ చేసుకొని కొత్త జిల్లాలలో అసోసియేషన్ నూతనంగా శాఖలు ఏర్పాటు చేసుకొని
ఎన్నికలు నిర్వహించామని, 53 సంవత్సరాలుగా నిర్దిష్ట నియమాలతో మా అసోసియేషన్
పని చేస్తుందని అదే విధానం కొనసాగించి ఉద్యోగులకు సేవలు చేస్తామని
తెలియచేశారు. నూతనంగా గా ఎన్నికైన కమిటీ తో ఎన్నికల అధికారి జె.వి సుబ్బరాజు
ప్రమాణం చేయించారు. ఈ ఎన్నికలకు పి.శ్యామ్ సుందర్ అసిస్టెంట్ ఎన్నికల అధికారి
గా వ్యవహరించారు. ఎ.పి.జె.ఎ.సి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు,
ఎ.పి.లేబర్ డిపార్టుమెంటు రాష్ట్ర అధ్యక్షులు బి.కిషోర్ కుమార్, ఎ.పి.
రెవెన్యూ అసోసియేషన్ ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి రామకృష్ణ , ఎ.పి. రెవెన్యూ
అసోసియేషన్ విజయవాడ నగర అధ్యక్షలు శ అప్పారావు ఈ కార్యక్రమములో పాల్గొని
నూతనంగా ఎన్నికైన అధ్యక్షలు టి.వి.ఫణిపేర్రాజు, జనరల్ సెక్రటరీ కె. భావన ఋషి,
కోశాధికారి వై.వి. కోటేశ్వరరావు, ఇతర కార్యవర్గమునకు అభినందనలు తెలిపారు.