విజయవాడ : విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి శుక్రవారం విజయవాడలో రాజ్ భవన్ ను సందర్శించారు. గవర్నరు అబ్దుల్ నజీర్ ను కలిసారు. ఈనెల 15వ తేదీ నుండి ప్రారంభం కానున్న విశాఖ శారదాపీఠం వార్షిక మహోత్సవాలకు రావాలని ఆహ్వానించారు. ఈమేరకు ఆహ్వాన పత్రికను అందచేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో అయోధ్య రామ మందిరానికి అనుకూలంగా గతంలో తీర్పునిచ్చిన న్యాయమూర్తుల్లో ఒకరైన అబ్దుల్ నజీర్ ను అభినందించారు. శతాబ్ధాల నాటి కల సాకారం కావడంలో గవర్నరు పాత్ర ఉండటం పట్ల ఆనందం వ్యక్తం చేసారు. సుప్రీంకోర్టు వేదికగా వచ్చిన చారిత్రాత్మక తీర్పల్లో అయోధ్య ఒకటని, అప్పటి నిర్ణయాన్ని భారతావని ఎన్నటికీ మరువదని పేర్కొన్నారు. అయోధ్య వివాద సమయంలో సుప్రీంకోర్టు వేదికగా చోటుచేసుకున్న అనేక పరిణామాలను స్వాత్మానందేంద్రకు గవర్నర్ వివరించారు.