సీఎం జగన్ సంక్షేమ పాలనకు సంపూర్ణ ప్రజా మద్దతు * 66 సర్పంచ్ ఎన్నికల్లో 30
ఏకగ్రీవాలు * 23 స్థానాల ఎన్నికల ఫలితాలతో కలిపి 53 చోట్ల వైఎస్సార్ సీపీ
గెలుపు
విజయవాడ : రాష్ట్రంలోని పంచాయతీ ఉప ఎన్నికల ఫలితాల్లో అధికార వైఎస్సార్ సీపీ
విజయకేతనం ఎగరేసింది. అత్యధిక స్థానాల్లో వైఎస్సార్ సీపీ మద్ధుతుదారులు విజయం
సాధించారు. సీఎం జగన్ సంక్షేమ పాలనకు మద్ధుతుగా ప్రజలు వైఎస్సార్ సీపీ
మద్ధుతుదారులకు ఘన విజయం అందించారు. రాష్ట్రంలో మొత్తం 66 గ్రామాల సర్పంచ్
పదవులకు గాను 64 గ్రామాల్లో ఎన్నికలు జరిగాయి. వాటిలోని 30 సర్పంచ్ పదవులు
ఏకగ్రీవమై వైఎస్సార్సీపీ మద్దతుదారుల గెలుపు సాధించారు. మిగిలిన 34 సర్పంచ్
పదవుల ఎన్నికల్లో 23 చోట్ల వైఎస్సార్సీపీ మద్దతుదారులు విజయ కేతనం ఎగురవేశారు.
10 స్థానాల్లో టీడీపీ మద్దతుదారులు, ఒక స్థానం జనసేన మద్దతుదారు గెలిచారు.
మొత్తం 1,062 వార్డుల్లో 63 స్థానాల్లో ఎన్నికలు జరగకపోగా ఎన్నికలు జరిగిన 243
వార్డుల్లో 149 వైఎస్సార్ సీపీ, 90 టీడీపీ, 4 జనసేన మద్దతుదారులు విజయం
సాధించారు. ఏకగ్రీవాలతో కలిపి రాష్ర్ట వ్యాప్తంంగా 810 చోట్ల వైఎస్సార్ సీపీ
మద్దతుదారులు, 182 వార్డుల్లో టీడీపీ మద్దతుదారులు, 7 వార్డుల్లో జనసేన
మద్దతుదారులు గెలుపొందారు. తాజా ఎన్నికల్లో ప్రజలు టీడీపీ మద్ధతుదారులను
ప్రజలు చిత్తుగా ఓడించారు. సీఎం జగన్ సంక్షేమ పాలనకు ఓటేసిన ప్రజలు ఎన్నికలు
ఏవైనా వైఎస్సార్ సీపీ ప్రజా మద్ధతుకు తిరుగులేదని మరోసారి నిరూపింతమైంది.
చంద్రబాబు అడ్డాలో వైఎస్సార్ సీపీ జెండా : చంద్రబాబు ప్రాతినిథ్యం వహిస్తున్న
కుప్పం నియోజకవర్గంలో ఆరు వార్డుల్లో ఎన్నికలు జరగ్గా వైఎస్సార్ సీపీ
మద్దతుదారులు ఐదు వార్డుల్లో విజయం సాధించారు. టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ
ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలోని చలివెందుల పంచాయతీ
ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారు ఉపేంద్ర రెడ్డి ఘన విజయం సాధించారు.
తాడిపత్రి నియోజకవర్గంలోని జేసీ బ్రదర్స్ సొంత మండలం పెద్దపప్పూరులో వైఎస్సార్
సీపీ మద్దతు దారులు గెలుపొందారు. దీంతో ప్రతిపక్షంలోని కీలక నేతల అడ్డాలో
విజయం సాధించిన అభ్యర్థులు వైఎస్సార్ జెండా ఎగరేశారు.
జిల్లాల వారీగా ఎన్నికలు జరిగిన స్థానాల్లో ఫలితాలు ఇలా : శ్రీకాకుళం
జిల్లాలో నాలుగు సర్పంచ్ స్థానాలకుగాను వైఎస్సార్సీపీ మద్దతుదారులు మూడు
చోట్ల, టీడీపీ మద్దతుదారు ఒక చోట గెలుపొందారు. ఎన్నికలు జరిగిన 10 వార్డు
సభ్యులకుగాను వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఆరుచోట్ల, టీడీపీ సానుభూతిపరులు
నాలుగు చోట్ల విజయం సాధించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో ఒక సర్పంచ్
స్థానాన్ని వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థి కైవసం చేసుకున్నారు. రెండు వార్డు
సభ్యులకుగాను వైఎస్సార్సీపీ, టీడీపీ బలపర్చిన అభ్యర్థులు చెరో స్థానాన్ని
దక్కించుకున్నారు. విజయనగరం జిల్లాలో మూడు సర్పంచ్ స్థానాలను వైఎస్సార్సీపీ
బలపర్చిన అభ్యర్థులు కైవసం చేసుకోగా.. వైఎస్సార్సీపీ, టీడీపీ మద్దతుదారు చెరో
స్థానంలో గెలుపొందారు. ఎనిమిది వార్డు సభ్యులకు గాను వైఎస్సార్సీపీ
మద్దతుదారులు ఆరుచోట్ల, టీడీపీ మద్దతుదారులు రెండుచోట్ల విజయం సాధించారు.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో మూడు స్థానాలకుగాను వైఎస్సార్సీపీ బలపర్చిన
అభ్యర్థులు రెండు చోట్ల, టీడీపీ మద్దతుదారు ఒకచోట విజయం సాధించారు. ఇక్కడ 14
వార్డు సభ్యులకుగాను 11 మంది వైఎస్సార్సీపీ, ఇద్దరు టీడీపీ మద్దతుదారులు,
ఇతరులు ఒకరు గెలుపొందారు. అనకాపల్లి జిల్లాలో ఎన్నిక జరిగిన ఒక సర్పంచ్
స్థానంలో టీడీపీ మద్దతుదారుడు గెలుపొందారు. ఈ జిల్లాలో ఏడు వార్డు
సభ్యులకుగాను ఐదుచోట్ల వైఎస్సార్సీపీ, రెండుచోట్ల టీడీపీ మద్దతుదారులు విజయం
సాధించారు. విశాఖ జిల్లాలో ఎన్నిక జరిగిన రెండు వార్డులనూ వైఎస్సార్సీపీ
మద్దతుదారులు కైవసం చేసుకున్నారు. కాకినాడ జిల్లాలో ఒక సర్పంచ్ స్థానంలో
టీడీపీ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు. ఇక్కడ ఆరు వార్డు సభ్యుల స్థానాల్లో
వైఎస్సార్సీపీ ఒకటి, టీడీపీ–3, జనసేన మద్దతుదారు ఒకచోట, ఇతరులు ఒక చోట విజయం
సాధించారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఎన్నిక జరిగిన ఒక
సర్పంచ్ స్థానాన్ని వైఎస్సార్సీపీ మద్దతుదారుడు విజయం సాధించారు. ఆరు వార్డు
సభ్యులకు గాను ఐదుచోట్ల వైఎస్సార్సీపీ మద్దతుదారులు.. ఇతరులు ఒకచోట
గెలుపొందారు. తూర్పుగోదావరి జిల్లాలో ఎనిమిది వార్డు సభ్యుల స్థానాలకుగాను
నాలుగింటిని వైఎస్సార్సీపీ, మూడింటిని టీడీపీ, ఒక చోట జనసేన మద్దతుదారులు
గెలుపొందారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక సర్పంచ్ స్థానంలో టీడీపీ బలపర్చిన
అభ్యర్థి గెలుపొందారు. 10 వార్డు సభ్యులకుగాను ఆరుచోట్ల వైఎస్సార్సీపీ,
నాలుగింటిలో టీడీపీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు. ఏలూరు జిల్లాలో
మూడు సర్పంచ్ స్థానాలనూ వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థులే గెలుపొందారు. ఈ
జిల్లాలో 21 వార్డు సభ్యుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో చెరో పది స్థానాల్లో
వైఎస్సార్సీపీ, టీడీపీ మద్దతుదారులు, ఒకచోట జనసేన సానుభూతిపరుడు విజయం
సాధించారు. కృష్ణా జిల్లాలో ఒక సర్పంచ్ స్థానంలో వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు
విజయం సాధించారు. ఇక్కడ మొత్తం ఎనిమిది వార్డు సభ్యుల స్థానాల్లో చెరో
నాలుగింటిలో వైఎస్సార్సీపీ, టీడీపీ మద్దతుదారులు గెలుపొందారు. ఎన్టీఆర్
జిల్లాలో రెండు సర్పంచ్ స్థానాలనూ వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థులే కైవసం
చేసుకున్నారు. ఈ జిల్లాలో మూడు వార్డు సభ్యులకు జరిగిన ఉప ఎన్నికల్లో
రెండింటిని వైఎస్సార్సీపీ, ఒకటి టీడీపీ సానుభూతిపరుడు దక్కించుకున్నారు.
గుంటూరు జిల్లాలో ఒక్క సర్పంచ్ స్థానంలో టీడీపీ సానుభూతిపరుడు గెలుపొందారు.
ఇక్కడ ఏడు వార్డు సభ్యులకుగాను రెండుచోట్ల వైఎస్సార్సీపీ, నాలుగుచోట్ల టీడీపీ,
ఒకచోట జనసేన బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. పల్నాడులో ఎన్నికలు జరిగిన 14
వార్డుల్లో 8 చోట్ల వైఎస్సార్సీపీ, ఆరుచోట్ల టీడీపీ బలపర్చిన అభ్యర్థులు విజయం
సాధించారు. బాపట్ల జిల్లాలో రెండుచోట్ల సర్పంచ్ ఎన్నికలు జరగ్గా..
వైఎస్సార్సీపీ, జనసేన బలపర్చిన అభ్యర్థులు చెరో స్థానాన్ని
చేజిక్కించుకున్నారు. జిల్లాలో మొత్తం 11 వార్డు స్థానాల్లో ఆరింటిని
వైఎస్సార్సీపీ, ఐదింటిని టీడీపీ బలపర్చిన అభ్యర్థులు దక్కించుకున్నారు.
ప్రకాశం జిల్లాలో ఒక సర్పంచ్ స్థానంలో టీడీపీ బలపర్చిన అభ్యర్థి విజయం
సాధించారు. ఇక్కడ 15 వార్డు సభ్యుల స్థానాల్లో ఎనిమిదింటిని వైఎస్సార్సీపీ,
ఏడుచోట్ల టీడీపీ బలపర్చిన అభ్యర్థులు గెలుపొందారు. నెల్లూరు జిల్లాలో ఒక
సర్పంచ్ స్థానంలో టీడీపీ మద్దతుదారుడు గెలుపొందారు. 11 వార్డు సభ్యులకుగాను 6
చోట్ల వైఎస్సార్సీపీ, ఐదుచోట్ల టీడీపీ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు.
తిరుపతిలో ఒక సర్పంచ్ స్థానాన్ని వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థి కైవసం
చేసుకున్నారు. ఈ జిల్లాలో ఏడు వార్డు సభ్యులకుగాను ఆరుచోట్ల వైఎస్సార్సీపీ,
ఒకచోట టీడీపీ మద్దతుదారు గెలుపొందారు. చిత్తూరు జిల్లాలో ఏడు వార్డు
సభ్యులకుగాను ఆరింట వైఎస్సార్సీపీ, ఒకచోట టీడీపీ బలపర్చిన అభ్యర్థి
గెలుపొందారు. కర్నూలులో ఒక సర్పంచ్ స్థానాన్ని వైఎస్సార్సీపీ మద్దతుదారుడు
కైవసం చేసుకున్నారు. ఈ జిల్లాలో మొత్తం 15 వార్డు సభ్యులకుగాను తొమ్మిది చోట్ల
వైఎస్సార్సీపీ, ఆరుచోట్ల టీడీపీ మద్దతుదారులు విజయం సాధించారు. అనంతపురంలో
టీడీపీ సానుభూతిపరుడు ఒక సర్పంచ్ స్థానంలో గెలుపొందారు. ఇక్కడ 11 వార్డు
సభ్యుల స్థానాలకుగాను ఆరింట వైఎస్సార్సీపీ, ఐదుచోట్ల టీడీపీ మద్దతిచి్చన
అభ్యర్థులు విజయం సాధించారు. నంద్యాల జిల్లాలో వైఎస్సార్సీపీ బలపర్చిన
అభ్యర్థి ఒక సర్పంచ్ స్థానంలో విజయం సాధించారు. ఇక్కడ మొత్తం 19 వార్డు సభ్యుల
స్థానాలకుగాను 16 చోట్ల వైఎస్సార్సీపీ, మూడుచోట్ల టీడీపీ మద్దతుదారులు
గెలుపొందారు. శ్రీ సత్యసాయి జిల్లాలో ఎన్నిక జరిగిన సర్పంచ్ స్థానాన్ని
వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థి కైవసం చేసుకున్నారు. మొత్తం 13 వార్డు సభ్యుల
స్థానాలకుగాను ఆరుచోట్ల వైఎస్సార్సీపీ బలపర్చిన అభ్యర్థులు, ఏడుచోట్ల టీడీపీ
మద్దతుదారులు గెలుపొందారు. వైఎస్సార్ కడప జిల్లాలో ఒక సర్పంచ్ స్థానంలో
వైఎస్సార్సీపీ మద్దతుదారుడు గెలుపొందారు. ఈ జిల్లాలో మూడు వార్డు స్థానాల్లో
రెండు చోట్ల వైఎస్సార్ సీపీ, ఒకచోట టీడీపీ బలపర్చిన అభ్యర్థి గెలుపొందారు.
అన్నమయ్య జిల్లాలో మూడు వార్డుల్లో రెండింటిని వైఎస్సార్సీపీ, ఒకటి టీడీపీ
బలపర్చిన అభ్యర్థి కైవసం చేసుకున్నారు.