అమరావతి : కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ ఆధ్వర్యంలో ఏపీ పెండింగ్ అంశాలపై
బుధవారం కీలక సమావేశం జరగనుంది. కేబినెట్ సచివాలయంలోని కేంద్ర, రాష్ట్రాల
సమన్వయ కార్యదర్శి నేతృత్వంలో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. కేంద్రం నుంచి
పెండింగ్లో ఉన్న అంశాల జాబితాను ఈ నెల మొదటివారంలోనే అందించాలని ఏపీని
కేబినెట్ సెక్రటేరియట్ ఆదేశించింది. ఆయా మంత్రిత్వ శాఖల వద్ద ఏపీకి
సంబంధించిన పెండింగ్ అంశాల జాబితాను కూడా కేబినెట్ సెక్రటేరియట్ కోరింది.
విభజన చట్టంలో ఏపీ కోసం ప్రత్యేకంగా ఇచ్చిన హామీలు, నెరవేర్చిన అంశాలు, ఇంకా
పెండింగ్లో ఉన్న వాటిపై తొలిసారి సమీక్ష జరపనున్నారు. ఉన్నత విద్యాసంస్థలు,
ఎయిమ్స్, మౌలిక సదుపాయాలు, పోలవరం ప్రాజెక్టు, రైల్వే జోన్, ప్రత్యేక హోదా,
రాజధానిని హైదరాబాద్కు అనుసంధానం చేయడం, కొత్త రాజధానికి ఆర్థిక సహకారం
అందించడం వంటి వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన మొత్తం 34 పెండింగ్ అంశాలను
కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్ అజెండాలో పెట్టింది. 2016 సెప్టెంబర్ వరకే
ఏపీ పెండింగ్ అంశాలపై తమ వద్ద జాబితా ఉందని స్పష్టం చేసింది. పెండింగ్ అంశాల
జాబితాను అప్డేట్ చేయాలని ఇప్పటికే రాష్ట్రానికి కేబినెట్ సెక్రటేరియట్ లేఖ
రాసింది.