సంక్రాంతి తర్వాత ఏపీలో బీఆర్ఎస్ కార్య కలాపాలు పెరుగుతాయని సీఎం కేసీఆర్
చెప్పారు. ఏపీలో పార్టీ అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ ను
నియమిస్తున్నట్లు ప్రకటించారు. మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు ఢిల్లీ
కేంద్రంగా పనిచేస్తారని వెల్లడించారు. త్వరలో భారీ స్థాయిలో చేరికలు ఉంటాయని
తెలిపారు. సిట్టింగులు కూడా తనకు కాల్ చేసి పార్టీలో చేరతామని చెబుతున్నారని
పేర్కొన్నారు.ఏపీకి చెందిన చంద్రశేఖర్, కిశోర్ బాబు, పార్థసారథిలు ముఖ్యమంత్రి కేసీఆర్
సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ఎంపీ రవిచంద్ర
మంత్రులతో కలిసి హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ నాయకులు
తోట చంద్రశేఖర్, రావెల కిశోర్ బాబు, పార్థసారథిలు బీఆర్ఎస్ అధ్యక్షులు,
తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు సమక్షంలో గులాబీ కండువా
కప్పుకున్నారు.తెలంగాణ భవన్ లో సోమవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమానికి
రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల
కమలాకర్, జగదీష్ రెడ్డి, మల్లారెడ్డి, ప్రశాంత్ రెడ్డి తదితర ప్రముఖులతో కలిసి
హాజరయ్యారు.