గుంటూరు : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలో విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామి సోమవారం కలిశారు. ఫిబ్రవరి 15నుండి ప్రారంభం కానున్న విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేసారు. 19తేదీ వరకు వార్షికోత్సవ వేడుకలు ఉంటాయని, ఆ సమయంలో పీఠానికి వచ్చి పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సులు అందుకోవాలని కోరారు. ఉత్సవాలలో భాగంగా మహా రుద్ర సహిత రాజ శ్యామల యాగం నిర్వహిస్తున్నామని, యాగంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహం పొందాలని సూచించారు. రాజ శ్యామల అమ్మవారి ప్రసాదాన్ని స్వాత్మానందేంద్ర స్వామి సీఎం చేతికి అందించారు.