వెంకటగిరి … వెంకటగిరి ఎక్స్ప్రెస్ న్యూస్
ఏపీ మోడల్ స్కూల్ లో బుధవారం జాతీయ నాయకుల విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు విగ్రహాలను ఎడ్యుకేషనల్ సర్వీస్ సొసైటీ మాజీ చైర్మన్ లక్కమునేని మురళీకృష్ణ తన సొంత నిధులతో ఏర్పాటు చేశారు జాతీయ నాయకుల విగ్రహావిష్కరణ అనంతరం స్కూల్లో ఏర్పాటుచేసిన ఆనందోత్సవ కార్యక్రమంలో పాల్గొని నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అనంతరంవిద్యార్థులుఉద్దేశించిమాట్లాడుతవిద్యార్థుల బంగారు భవిష్యత్తుకు జగన్ పెద్దపేట వేసినారని నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి పేర్కొన్నారు
పేద విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు కొరకు విద్య కు అధిక ప్రాధాన్యతను ఇస్తూ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపేట వేశారని వైస్సార్ సీపీ కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా అధ్యక్షులు, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త గౌరవ శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి సూచించారు. వెంకటగిరి లోని ఏపీ మోడల్ స్కూల్ ఆనందోత్సవ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ప్రతి పేద విద్యార్థి కార్పొరేట్ దీటుగా ఉన్నత చదువులు చదువుకునేందుకు నాడు నేడు ద్వారా వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మార్చేశారన్నారు. వెంకటగిరిలో ఏపీ మోడల్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం వంటివి పాఠశాలలో ఉండడం విద్యార్థులు చేసుకున్న గొప్ప వరమన్నారు. ప్రతి విద్యార్థి విద్య తో పాటు క్రమశిక్షణ గా రాణించాలని అదేవిదంగా పౌష్టికంగా ఉండాలని ఆకాంక్షించారు.