విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సువిశాల సముద్ర తీరం, పుష్కలమైన వనరులు,
నైపుణ్యత కల్గిన మానవ వనరులు, వ్యాపారులకు ప్రభుత్వ తోడ్పాటు తదితర అంశాలు
పెట్టుబడిదారులకు సానుకూలంగా ఉన్నాయాని రాజ్యసభ సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్
పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. ట్విట్టర్ వేదికగా
శనివారం ఆయన పలు అంశాలు వెల్లడించారు. పారిశ్రామికవేత్తలకు స్థలం మాత్రమే
కాకుండా సగటున 12 రోజుల్లో అనుమతులు కూడా లభిస్తున్నాయని అన్నారు. రాష్ట్రంలో
పరిశ్రమల కోసం 48 వేల ఎకరాలకు పైగా స్థలం సిద్ధంగా వుందని ఇప్పటికే ప్రభుత్వం
తెలిపిందన్నారు. వేసవిలో విద్యుత్ కొరత రాకూడదని, డిమాండ్ కు సరిపడా విద్యుత్
ను సమకూర్చుకోవడానికి అన్ని విధాలుగా సద్ధంకావాలని ఇంధన శాఖ సమీక్షలో
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారులను అదేశించారని విజయసాయిరెడ్డి
తెలిపారు. అలాగే రైతుల కనెక్షన్న మంజూరులో జాప్యం జరగకుడదని సిఎం
ఆదేశించినట్టు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 3000 దేవాలయాలు అభివృద్ధికి జగన్
మోహన్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుందని, ఒక్కో దేవాలయం 10 లక్షల
రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఈ నిధులు దేవాలయాలకు అవసరమైన అన్ని
బద్రతా చర్యలతో పాటు యాత్రికులకు మెరుగైన సౌకర్యాలను అందించనున్నట్లు
తెలిపారు. దేవాలయాల అభివృద్ధి ద్వారా మతపరమైన పర్యాటకం అభివృద్ధి చెందుతుందని
ఆయన అశాభావం వ్యక్తం చేశారు.