విజయవాడ : ఏపీ విఆర్ఏల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా గరికపాటి బ్రంహయ్య, ప్రధాన
కార్యదర్శి గా తలారి సీతారాం ఎన్నికయ్యారు. ఆదివారం ఏపీ గ్రామ రెవెన్యూ
సహాయకులు సంఘం (ఏపీ జేఏసీ అమరావతి అనుబందం) రాష్ట్ర కార్యవర్గం సమావేశం
విజయవాడ రెవెన్యూ భవన్ లో ఆ సంఘం రాష్ట్ర అద్యక్షులు జి.జయరాజు అధ్యక్షతన
జరిగింది. ఈ సమావేశం నందు పూర్వపు ఉమ్మడి జిల్లాలు దాదాపు 10 జిల్లాల నుండి
జిల్లా అధ్యక్ష/కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా
జీ.జయరాజు మాట్లాడుతూ తను వయస్సు రీత్యా వయో వృద్దుడను అగుటవలన ఈ భాద్యతలు
నుండి స్వచ్చనదంగా తప్పుకుంటున్నానని, కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోవాలని
కోరగా, 10 జిల్లాల ఆధ్యక్ష, కార్యదర్శుల సమక్షంలో ఎన్నికలు నిర్వహించగా ఈ
ఎన్నికలలో ఏపీ గ్రామ రెవెన్యూ సహాయకులు సంఘం (ఏపీ జేఏసీ అమరావతి అనుబందం)
రాష్ట్ర అధ్యక్షులుగా ప్రకాశం జిల్లా అధ్యక్షులుగా ఉన్న గరికిపాటి బ్రహ్మయ్య,
ప్రధాన కార్యదర్శ గా అనంతపురం జిల్లా అధ్యక్షులుగా ఉన్న తలారి సీతారామ్,
ఉపాధ్యక్షులు-I గా బాల్లా వెంకట్రావు (తూర్పు గోదావరి జిల్లా )
ఉపాధ్యక్షులు-II గా కర్నూల్ జిల్లా నుండి జీ. టి. రామాంజనేయులు, కోశాధికారిగా
చెన్నుపల్లి సత్యనారాయణ (బాపట్ల జిల్లా) ను అందరూ కలిసి ఏకగ్రవంగా
ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎపి జేఏసీ అమరావతి ఛైర్మెన్, ఏపీఅర్ యస్ ఏ
రాష్ట్ర అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ వీ ఆర్ ఓస్ అసోసియేషన్
నుండి అరేపల్లి సాంబ శివరావు , ఏపీ జేఏసీ అమరావతి, యన్ టి ఆర్ జిల్లా
అధ్యక్షులు ఈశ్వర్ దొప్పలపూడి హాజరయ్యారు. ఈ సందర్భంగా బొప్పరాజు మాట్లాడుతూ
నూతనంగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి, మిగిలిన కార్యవర్గ
సభ్యులు అందరూ కష్టపడి పనిచేసి, జేఏసీ సహకారంతో అన్నీ సమస్యలు పరిష్కరించుకునే
చొరవ చూపాలని కోరారు. వీఆర్ఏలు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను గురించి
ప్రభుత్వానికి గతంలో అనేకసార్లు విన్నవించడం జరిగిందని ప్రధానంగా దశాబ్దాల
క్రితం నుండి ఇస్తున్న డిఎ ను రద్దు చేయడం దుర్మార్గమని, ఇచ్చిన డి ఏ లను
తిరిగి మరల వెనక్కి తీసుకోవడం అనేది చాలా బాధాకరమైన విషయమని, అలాగే వీఆర్ఏలకు
ఎఫ్ ఆర్ ఎస్ అటెండెన్స్ (స్మార్ట్ ఫోన్లు కలిగి ఉండే స్థాయి లేని వాళ్ళు)
ప్రభుత్వం అడగటం శోచనీయం అని, జీతభత్యాలు పెంపుదల లేదని, భవిష్యత్తులో వీఆర్ఏ
ఆర్ధిక, ఆర్ధికేతర సమస్యలపై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి అతి త్వరలోనే
పరిష్కరించుటకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ పూర్తిగా ఉంటుందని తెలియజేస్తూ
నూతనంగా ఎన్నిక కాబడిన కార్యవర్గం, అధ్యక్ష , కార్యదర్శులకు శుభాకాంక్షలు
తెలియజేస్తూ వారిని అభినందించారు.