‘నాలుగేళ్ల నరకం’ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర
వ్యాప్తంగా పోస్టర్లు వెలిశాయి. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని
పేర్కొంటూ గణాంకాలతో సహా పోస్టర్లపై ముద్రించారు. గుంటూరు, విజయవాడ ప్రభుత్వ
ఆసుపత్రులు, ఒంగోలు రైల్వేస్టేషన్ తదితర కీలక ప్రాంతాల్లో పోస్టర్లు
అంటించారు. రాష్ట్రంలో పెరుగుతున్న క్రైమ్ రేట్, వెనుకబడిన వర్గాలు, మహిళలపై
దాడులు, ఎయిడెడ్ పాఠశాలల మూసివేత, పీజీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల
తొలగింపు, రైతు ఆత్మహత్యలు, ఆగిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు, ఎంఎన్సీ కంపెనీల
తరలింపు, నిరుద్యోగం వంటి కొన్ని ప్రధాన అంశాలు పోస్టర్లపై హైలెట్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని గాలికొదిలేసిందని చెబుతూ పోస్టర్ల ద్వారా
సామాజిక మాధ్యమాల్లో చర్చను తీసుకొచ్చారు. రానున్న రోజుల్లో ‘నాలుగేళ్ల నరకం’
క్యాంపెయిన్‌ను మరింత విస్తృతం చేయనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
*’నాలుగేళ్ల నరకం’ జగన్ సర్కార్ వైఫల్యాలను ప్రస్తావిస్తూ పోస్టర్లు కలకలం :
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూ తెలుగుదేశం పార్టీ
చేపట్టిన ‘నాలుగేళ్ల నరకం’ప్రచార కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా
కొనసాగుతోంది. రెండవ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్లు వెలిశాయి. ఇందులో
భాగంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని పేర్కొంటూ గణాంకాలతో సహా
పోస్టర్లపై ముద్రించారు. ప్రధానంగా గుంటూరు, విజయవాడలోని ప్రభుత్వ
ఆసుపత్రులు, ఒంగోలు రైల్వేస్టేషన్ వంటి కీలక ప్రాంతాలలో పోస్టర్లు అంటించారు.
రాష్ట్రంలో పెరుగుతున్న నేరాల రేట్లు, వెనుకబడిన వర్గాలు, మహిళలపై దాడులు,
ఎయిడెడ్ పాఠశాలల మూసివేత, పీజీ విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల తొలగింపు, రైతు
ఆత్మహత్యలు, ఆగిపోయిన ఆరోగ్యశ్రీ సేవలు, ఎంఎన్ సీ కంపెనీల తరలింపు, నిరుద్యోగం
వంటి కొన్ని ప్రధాన అంశాలు పోస్టర్లపై హైలైట్ చేశారు.
రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది లైంగిక వేధింపులు, యాసిడ్ దాడులు
పెరిగిపోయాయి. మహిళలపై దాడుల సంఖ్య 2020లో 7,039 ఉండగా 2021లో 10,373 నుండి
2022 నాటికి 11,895కి పెరిగింది. మహిళలకు మరింత రక్షణ కల్పించాల్సిన ‘దిశా’
చట్టం , ఇప్పటికీ అమలు కాలేదు. 2023 ఎస్సెస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం 77
శాతంగా నమోదైంది. దీంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
అంతకుముందు టీడీపీ హయాంలో ఉత్తీర్ణత శాతం ఎప్పుడూ 90శాతం కిందకు పడిపోయిన
దాఖలాలు లేవు. పీజీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్లను రద్దు
చేసింది.దీంతో పీజీ విద్యార్థులు ప్రైవేట్ కాలేజీల్లో చదువుతూ ఆర్థికంగా
ఇబ్బంది పడుతున్నారు. అంతేకాదు ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు కూడా పెంచకపోవడంతో
మరింత ఇబ్బందులకు విద్యార్థులు గురవుతున్నారు.
రైతు ఆత్మహత్యలు: రైతు ఆత్మహత్యల్లో రాష్ట్రం దేశంలోనే మూడో స్థానంలో ఉంది.
గడిచిన నాలుగేళ్లలో 3 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. పక్క
రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ ఖరీదు 15,000 రూపాయలు కాగా, రాష్ట్రంలో అది 36,000
రూపాయలుగా ఉంది. ఆరోగ్యం, మౌలిక సదుపాయాలపై తక్కువ పెట్టుబడి,పెరిగిన
నిరుద్యోగం ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం బకాయిలు చెల్లించాల్సి
ఉంది. రాష్ట్రంలో పదకొండు వైద్య కళాశాలలు నిర్మాణ దశలోనే ఉన్నాయి. ఈ కాలేజీలకు
సూపరింటెండెంట్లు కూడా లేరు. ప్రభుత్వ వేధింపుల వల్ల 53 పరిశ్రమలు రాష్ట్రం
విడిచి వెళ్లిపోయాయి. కనీసం 0.5% విదేశీ పెట్టుబడులు రాష్ట్రానికి రాలేదు.
చిత్తూరు డెయిరీ ఆస్తులను 99 ఏళ్లకుగాను అమూల్ సంస్థకు అప్పగించారు. గడిచిన
నాలుగేళ్లలో ఉద్యోగాల క్యాలెండర్ ఎక్కడ వేసిన గొంగిలి అక్కడే అన్నట్లుగా ఉంది.
ఒక్క డీఎస్సీ పరీక్ష కూడా జరగలేదు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత యువతలో
నిరుద్యోగిత రేటు 35.1 శాతంగా ఉంది.
రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిని గాలికొదిలేసిందని చెబుతూ పోస్టర్ల ద్వారా
సామజిక మాధ్యమాల్లో చర్చను తీసుకొచ్చారు. రానున్న రోజుల్లో నాలుగేళ్ల నరకం అనే
ఈ క్యాంపెయిన్‌ను మరింత విస్తృతం చేయనున్నారు. ఇందులో భాగంగా
రాష్ట్రవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించి జగన్ ప్రభుత్వ తీరును ఎండగట్టనున్నారు.
ఈ మేరకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు రాష్ట్ర ప్రజలు ఈ ర్యాలీల్లో
పాల్గొనడంతో పాటు సోషల్ మీడియా క్యాంపెయిన్‌లో కూడా భాగస్వాములు కావాలని
టీడీపీ పిలుపునిచ్చింది. వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను హ్యాష్‌ట్యాగ్‌లో
విస్తృతంగా షేర్ చేయాలని కోరింది.