గుంటూరు : ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలుగు సినీ గేయ రచయిత
దివంగత సిరివెన్నెల సీతారామశాస్త్రి కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది. సిరివెన్నెల
భార్య పద్మావతి, కుమారులు యోగేశ్వర శర్మ, రాజా, కుమార్తె లలితాదేవి, సోదరుడు
సీఎస్ శాస్త్రి తదితరులు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ను
మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
‘సిరివెన్నెల’ వైద్య ఖర్చులను ఏపీ ప్రభుత్వం భరించడంతో పాటు విశాఖపట్టణంలో ఆయన
కుటుంబానికి ఇంటి స్థలం కేటాయించిన నేపథ్యంలో జగన్కు వారు కృతజ్ఞతలు
తెలిపారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ సిరివెన్నెల కుటుంబానికి పూర్తి సహాయ
సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.