గుంటూరు : ఏప్రిల్ 5 న భవిష్యత్ ఉద్యమకార్యాచరణను ప్రకటిస్తామని ఏపిజెఏసి
అమరావతి స్టేట్ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఉద్యోగుల
సమస్యలు పరిష్కారం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్దపడతామని, ఉద్యోగులపట్ల
ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్యదోరణి వల్లనే ఉద్యమం కొనసాగుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో పనిచేస్తున్న ఉద్యోగుల ఆర్ధిక, అర్ధికేతర ప్రభుత్వం హామీ
ఇచ్చిన హామీలపై ఎలాంటి స్పష్టత లేనందున, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు
పరిష్కారం అంటే ఉద్యోగులకు చెల్లించాల్సిన వేల కోట్ల బకాయిలు పైనగాని, సిపియస్
రద్దు పైన గానీ, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దికరణపైన గాని, ఔట్ సోర్శింగు
ఉద్యోగుల జీతాల పెంపుదల విషయంలోగాని, ఎంప్లాయీస్ హెల్త్ కార్డులు పూర్తి
స్థాయిలో అమలు పై గానీ ప్రభుత్వం నుండి ఇంతవరకు ఎటువంటి స్పష్టత లేనందున,
ఎంతటి పోరాటానికైనా వెనుకాడేది లేదని చెప్పారు. దీనికి సంబందించి ఉద్యోగుల
మద్దతుతో భవిష్యత్ ఉద్యమ కార్యచరణ షెడ్యూల్ ను ఏఫ్రిల్ 5 న జరుగబోయే
రాష్ట్రకార్యవర్గ సమావేశంలో ప్రకటిస్తామని ఏపిజెఏసి అమరావతి స్టేట్ చైర్మన్
బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు, అసోషియేట్
చైర్మన్ టి.వి.ఫణిపేర్రాజు తెలిపారు.
సోమవారం గుంటూరులో గుంటూరు జిల్లా ఏపిజెఏసి అమరావతి చైర్మన్ కనపర్తి
సంగీతరావు,జిల్లా ప్రధానకార్యదర్శి పి.ఏ.కిరణ్ కూమార్ ఆద్వర్యంలో గుంటురులో
శాఖాధిపతులు కార్యాలయాలు కో-ఆపరేటివ్ డిపార్ట్మెంట్, జిల్లా పరిషత్,
ఇంజనీరింగ్ శాఖల కార్యాలయాలు, లెక్టరేట్ గుంటూరు, అగ్రికల్చర్ కమిషనర్
కార్యాలయం, హార్టికల్చర్ కమిషనర్ కార్యాలయం, మార్కెటింగ్ కమీషనర్ కార్యాలయం,
ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కమిషనర్ ఆఫీసులలో పనిచేస్తున్న సిబ్బందిని అందరిని
ఏపిజెఏసి అమరావతి రాష్ట్రనాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, పలిశెట్టి
దామోదరరావు, టి వి.ఫణి పేర్రాజు ఆద్వర్యంలో జెఏసి నాయకుల బృందం అన్ని ఆఫీసులను
సందర్శించి ఉద్యోగులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లు
పరిష్కారం కోసం చేస్తున్న ఈ పోరాటంలో అందరు భాగస్వాములు కావాలని విజ్ఞప్తి
చేస్తూ ఉద్యోగులకు సంబందించిన ఆర్దిక, ఆర్ధికేతర సమస్యలు పరిష్కారం లో
ప్రభుత్వం ఇంకా జాప్యం చేస్తే మాత్రం ఏఫ్రిల్ 5 న ప్రకటించ నున్న భవిష్యత్
కార్యచరణ వలన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా సరే దానికి ప్రభుత్వమే బాద్యత
వహించాల్సివస్తుందని బొప్పరాజు, పలిశెట్టి దామోదరరావు తెలిపారు.
ఈ కార్యక్రమాలలో క్లాస్-4 ఎంప్లాయిస్ అసోషియేషన్ అద్యక్షులు
యస్.మల్లేశ్వరరావు, గ్రామసచివాలయ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు
వి.అర్లయ్య, సీసీయల్ ఏ హెచ్ ఓ డీ సిటీ కార్యదర్శి కుసుమ కుమారి,
ఉపాద్యక్షురాలు జి.జ్యోతి, వి.ఆర్.ఒ. సంఘం రాష్ట్రకార్యదర్శి ఏ.సాంబశివరావు,
ఆర్టీసి ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు యన్.వి.కృష్టారావు, ఇ.విజయ్ కుమార్ తో
పాటు గుంటూరు జిల్లా ఏపిజెఏసి అమరావతి చైర్మన్ కనపర్తి సంగీతరావు, ఫ్రధాన
కార్యదర్శి పి.ఏ.కిరణ్ తదితర నాయకులు, ఉద్యోగులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.