ప్రాజెక్టులకు సీఎం జగన్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.
రూ.135.88 కోట్లతో జీవీఎంసీ చేపడుతున్న ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపన చేశారు.
ఆంధ్ర విశ్వ కళాపరిషత్‌లో పలు నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులను సీఎం జగన్
ప్రారంభించారు. ఏయూ క్యాంపస్‌లో సుమారు రూ.21 కోట్లతో స్టార్టప్ టెక్నాలజీ
ఇంక్యుబేషన్ హబ్ (ఏ హబ్)ను అభివృద్ధి చేశారు. 2025 నాటికి 2 లక్షల చదరపు
అడుగుల విస్తీర్ణంతో దేశంలోనే అతిపెద్ద ఇన్నొవేషన్ హబ్‌గా దీన్ని
తీర్చిదిద్దనున్నారు. విభిన్న రంగాలకు చెందిన ఇంక్యుబేషన్ సెంటర్‌తోపాటు
ఎనెక్స్ సెంటర్స్, ప్రోటోటైపింగ్/మేకర్స్ ల్యాబ్, స్టూడెంట్ ఐడియేషన్
సెంటర్లను అభివృద్ధి చేయనున్నారు. రూ.44 కోట్లతో ఫార్మా కంపెనీల కోసం 55,000
చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పిన ఫార్మా ఇంక్యుబేషన్, బయోలాజికల్
మానిటరింగ్ హబ్‌ను సీఎం ప్రారంభించారు.
డిజిటల్ క్లాసులు, డిజిటల్ పరీక్షల కోసం రూ.35 కోట్లతో అల్గోరిథమ్ పేరుతో
ఏయూ డిజిటల్ జోన్ అండ్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ కాంప్లెక్స్‌ను నూతనంగా
నిర్మించారు. అంతర్జాతీయ అనలిటిక్స్‌లో మాస్టర్ పోగ్రాములు నిర్వహించేలా ఏయూ
స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్ సెంటర్‌ను రూ.18 కోట్లతో 25,000 చదరపు
అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. మెరైన్ ఫార్మింగ్, ప్రాసెసింగ్
ప్యాకేజింగ్‌లో నైపుణ్య శిక్షణ కోసం అవంతి ఫుడ్స్‌తో కలిపి రూ.11 కోట్లతో ఏయూ
అవంతి ఆక్వా కల్చర్ స్కిల్ ఎంటర్ప్రెన్యూర్ షిప్ హబ్‌ను నెలకొల్పారు.
వీటిని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించి విద్యార్థులతో సంభాషించారు. నూతన భవనాల
ద్వారా 2025 నాటికి ఆంధ్రా యూనివర్సిటీ దేశంలో విభిన్న రంగాలకు అతిపెద్ద
ఇంక్యుబేటర్ హబ్‌గా తయారు అవుతుందని అంచనా వేస్తున్నారు. కనీసం 350కుపైగా
స్టార్టప్స్‌తోపాటు 150కు పైగా పేటెంట్లు, ట్రేడ్ మార్క్స్‌ను నమోదు
చేస్తుందని అంచనా. ఈ హబ్స్ ద్వారా కనీసం 2,000 మందికి ప్రత్యక్షంగా, 5,000
మందికి పరోక్షంగా ఉపాధి లభించడమే కాకుండా ఎగుమతులు దిగుమతుల ద్వారా ఆరి్థక
వ్యవస్థకు రూ.480 కోట్ల వరకు సమకూరనుంది.