విభిన్న కథలతో సినిమాలు చేస్తుంటాడు కోలీవుడ్ హీరో శివకార్తికేయన్.
‘డాక్టర్ వరుణ్’ సినిమాతో మంచి హిట్ అందుకున్న ఆయన.. అనుదీప్ కేవీ దర్శకత్వంలో
‘ప్రిన్స్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. తాజాగా ఆయన నటిస్తున్న
కొత్త ప్రాజెక్ట్ ‘అయలాన్’.ఆర్.రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ బ్యూటీ రకుల్
ప్రీత్ సింగ్ ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు అయలాన్
సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేశారు. శివకార్తికేయన్ గగనంలో
విహరిస్తుండగా.. అతడితోపాటే ఏలియన్ వెళ్లడం పోస్టర్లో కనిపిస్తోంది.

మొత్తానికి ఈ సారి మాత్రం సైన్స్ ఫిక్షన్ జోనర్లో సాగే సినిమాను
శివకార్తికేయన్ ఎంచుకున్నట్లు తాజా లుక్‌తో అర్థమవుతోంది. దీపావళి కానుకగా ఈ
చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఈ
చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. శరద్
కేల్కర్, ఇషా కొప్పికర్, భానుప్రియ, యోగి బాబు, కరుణాకరన్, బాల శరవణన్
తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
మరోపక్క, మడొన్నే అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మావీరన్’లో కూడా
శివకార్తికేయన్ నటిస్తున్నారు. తెలుగులో మహావీరుడు టైటిల్‌తో రిలీజ్
చేయనున్నారు. స్టార్ డైరెక్టర్ శంకర్ కూతురు అదితి శంకర్ ఈ సినిమాలో
హీరోయిన్ గా నటిస్తోంది.