ఏలూరు: తెదేపా అధినేత చంద్రబాబు ఏలూరు జిల్లాలో పర్యటిస్తున్నారు. కాసేపట్లో
పెదవేగి మండలం విజయరాయిలో ‘ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి’ కార్యక్రమాన్ని ఆయన
లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఏలూరు జిల్లా పర్యటనలో భాగంగా కలపర్రు టోల్గేట్
వద్ద చంద్రబాబుకు తెదేపా శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. పెద్ద ఎత్తున
కార్యకర్తలు తరలివచ్చి భారీ గజమాలతో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం తెదేపా
శ్రేణులు ద్విచక్ర వాహన ర్యాలీతో జానంపేట మీదుగా విజయరాయి చేరుకున్నారు. నేటి
నుంచి మూడు రోజుల పాటు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన
కొనసాగనుంది. దెందులూరు, చింతలపూడి నియోజకవర్గాల్లో రోడ్డు షోలు
నిర్వహించనున్నారు. విజయరాయిలో ‘ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి’ కార్యక్రమం
ప్రారంభించి అక్కడ నిర్వహించే బహిరంగ సభలో ఆయన మాట్లాడనున్నారు. అనంతరం
మధ్యాహ్నం 1.30కు బయలుదేరి 3 గంటలకు వలసపల్లి అడ్డరోడ్డు వద్దకు చేరుకుంటారు.
ధర్మాజీగూడెం, మఠంగూడెం, లింగపాలెం గ్రామాల్లో జరిగే సమావేశాల్లో
పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు చింతలపూడిలోని భారత్ పెట్రోలు బంకు వద్ద
నుంచి రోడ్డు షో ప్రారంభిస్తారు. బోసు బొమ్మ కూడలిలో బహిరంగ సభలో
ప్రసంగిస్తారు. వైకాపా ప్రభుత్వ తీరుతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై
పోరాడేందుకు తెదేపా శ్రేణులను చంద్రబాబు సమాయత్తం చేయనున్నారు.