మోడీ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం కనపడుతుందా
గాంధీ దేశం వెల్ఫేర్ ట్రస్ట్ ఛైర్మన్ ఆర్ ఆర్ గాంధీనాగరాజన్
అఖిలపక్ష ప్రజాస్వామ్య వాదుల రౌండ్‌టేబుల్ సమావేశం
విజయవాడ : పార్లమెంట్లో ప్రధాని మోదీని ప్రశ్నిస్తే రాహుల్‌గాంధీపై అసత్యపు
వేటును, ప్రజాస్వామ్యంలో ఆయనపై జరుగుతున్న కక్షసాధింపు ధోరణి విధానాన్ని
నిరసిస్తూ అఖిలపక్ష ప్రజాస్వామ్య వాదుల రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది.
సోమవారం ఓ ప్రైవేట్ హోటల్లో జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో గాంధీ దేశం
వెల్ఫేర్ ట్రస్ట్ ఛైర్మన్ ఆర్ ఆర్ గాంధీనాగరాజన్ మాట్లాడుతూ
ప్రజాస్వామ్యవాదులు, కాంగ్రెస్, కమ్యూనిస్ట్, బహుజనుల పార్టీలు ఐకమత్యంతో
ఉద్యమిస్తేనే ప్రజాస్వామ్యానికి రక్షణ అని అన్నారు. న్యాయదేవతకు ప్రతిరూపాలైన
న్యాయమూర్తులు తాము ఇచ్చిన తీర్పులను పదవీ విరమణ తర్వాత కూడా చరిత్రలో
గుర్తుండిపోయేలా వుండి అందరికీ ఉపయోగపడేలా వుండటమే కాకుండా వారు కూడా
ప్రజలలోకి వెళ్ళి మమేకమై ప్రజలకు సాయం అందించి చైతన్యపరచాలని కోరారు.
అంతేకాకుండా ఏవిధమైన ప్రలోభాలకు లొంగకుండా స్వలాభాపేక్ష లేకుండా అధికారం మీద
వ్యామోహం లేకుండా, పార్టీ రాజకీయాలకు అతీతంగా న్యాయదేవతకు ప్రతిరూపంగా
వుండాలన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ పగ్గాలు మొత్తం ఆదానీ చేతిలో వున్నాయని అన్నారు.
సృష్టికర్త ఆదామ్తో ఆరంభమైన ప్రపంచంలో ఆదానీతో అంతమయ్యే మొదటి దేశంగా మనది
వుందన్నారు. ఈ పరిస్థితి రాకుండా ప్రజాస్వామ్యం రక్షణకు ప్రధాని మోదీ వెంటనే
రాజీనామానే మార్గమని అన్నారు. లేకుంటే ప్రజాస్వామ్యానికి రక్షణ లేదన్నారు.
భావితరాలకు భవితవ్యం లేదని అన్నారు. ‘చీకటి నుండి వెలుతురుకు…’ అన్న
మహాత్మాగాంధీ సందేశం అయితే ఇప్పుడు వెలుతురు నుండి చీకటి…ప్రధాని నరేంద్ర
మోడీ పరిపాలనా విధానం వుందని ఎద్దేవా చేశారు. ప్రజాస్వామ్యానికి బలం పెద్దలు,
చిన్న పిల్లలు, అన్ని వర్గాలు ప్రజాస్వామ్య పరిరక్షణకు పోరాడేందుకు
పిలుపునిచ్చారు. 33 శాతం మహిళా రిజర్వేషన్, ప్రత్యేక హోదా గురించి నోరు
విప్పని మోడీ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం కనపడుతుందా అని ప్రశ్నించారు.
ఈ రౌండ్ టేబుల్ చర్చా వేదికలో వక్తలు మాట్లాడుతూ సమస్యాత్మక విధానాలపై
విశ్లేషణ, చర్చ, అభిప్రాయాలను తెలియజేసి సంఫీుభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో
వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, మేధావులు, వివిధ శాఖల, వివిద వర్గాల
వారు, శ్రామికులు, మాజీ ఉద్యోగులు, విద్యార్దులు, పాత్రికేయులు, గాందేయవాధులు,
గాంధీ ట్రస్ట్ మహిళా అధ్యక్షురాలు ఆర్.ఎన్.శివరంజని, ట్రస్టు రాష్ట్ర
అధ్యక్షురాలు బాపతి భారతి తదితరులు పాల్గొన్నారు.