ఏపిఎన్జీవో నగర శాఖ నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
జిల్లా అధ్యక్షుడు ఏ.విద్యాసాగర్
విజయవాడ : ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండా ఏపి ఎన్జీవె
అసోసియేషన్ పనిచేస్తుందని ఉద్యోగ సమస్యలపై చేపట్టే పోరాటాల్లో విజయవాడ నగర
శాఖ కీలక పాత్ర వహిస్తుందని ఏపిఎన్జివో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు
ఏ.విద్యాసాగర్ అన్నారు. ఏపిఎన్జివో నగర శాఖ నూతన కార్యవర్గ ఎన్నిక శనివారం
విజయవాడ గాంధీనగర్‌లోని ఏపిఎన్జివో హోమ్ నందు నిర్వహించారు. నగర
కార్యవర్గానికి ఎన్జివో జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ బలపరచిన అభ్యర్థులు
ఎన్జీవో హోమ్ నుండి అలంకార్ సెంటర్ మీదుగా ర్యాలీగా బయలుదేరి తిరిగి ఎన్జివో
హోమ్‌కు చేరుకుని ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు.
కార్యవర్గంలోని ఒక్కొక్క పదవికి ఒక్కొక్క అభ్యర్థి నామినేషన్ వేయడంతో పోటీలో
ఉన్న అభ్యర్థులు గెలిపొందినట్లు ఎన్నికల అధికారి యండి ఇక్బాల్ ప్రకటించారు.
అనంతరం ఉద్యోగులను ఉద్దేశించి విద్యాసాగర్ మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించి
డిఏ బకాయి పిఆర్సి బకాయి చెల్లింపు జిపిఎఫ్ ఇన్సూరెన్స్ సరెండర్ లీవ్ వంటి
బిల్లుల చెల్లింపుపై ప్రభుత్వం తాత్సారం చేయడం తగదన్నారు. సిపిఎస్ రద్దుతో
పాటు అనేకమైన డిమాండ్లు సంవత్సరాలు తడబడి అపరిష్క్రతంగా ఉన్నాయన్నారు. సమస్యల
పరిష్కారంపై ఉద్యోగుల సంఘాలతో సమావేశాలు నిర్వహిస్తున్నారే తప్ప
పరిష్కరించేందుకు అడుగులు ముందుకు వేయడం లేదన్నారు. ప్రభుత్వ అనుసరిస్తున్న
విధానం పట్ల ఉద్యోగుల తీవ్ర నిరాశకు గురవుతున్నట్లు పేర్కొన్నారు.
ఇప్పటికైన ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని
లేని పక్షంలో అందోళన బాట పట్టేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారన్నారు.
నగర శాఖకు ఏకగ్రీవంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు వీరే…
*ఏపిఎన్జివో అసోసియేషన్ విజయవాడ నగర శాఖకు అధ్యక్షునిగా సిహెచ్. శ్రీరామ్ (
స్త్రీ శిశు సంక్షేమ ) సహాధ్యక్షులుగా బి.వి.రమణ (వైద్య ఆరోగ్య), కార్యదర్శిగా
కె.సంపత్‌కుమార్ (పంచాయతీరాజ్ ), కార్యనిర్వహక కార్యదర్శిగా వి.వి. ప్రసాద్
(సమాచార ), కోశాధికారిగా ఎస్.కె.నజీరుద్దీన్ (జలవనరుల), ఉపాధ్యక్షులుగా
సిహెచ్. మధుసుదన్‌రావు (పాలిటెక్నిక్ ), బి.రాజాచౌదరి (వైద్య ఆరోగ్య ),
ఎస్.కె.కాశీమ్ సాహెబ్ (పశుసంవర్థక, సిహెచ్. సి.వి.ఆర్. ప్రసాద్ (మల్యేరియా),
సంయుక్త కార్యదర్శులుగా కె.ఆర్.ఎస్.గణేష్ (వాణిజ్య పనుల), సిహెచ్.
ఎస్.రాధాకృష్ణ (ఐటిఐ), పి.శ్రీనివాసరావు (పిఏవో), జి.వరప్రసాద్ (రెవెన్యూ),
మహిళా సంయుక్త కార్యదర్శిగా బి.విజయశ్రీ (వైద్య ఆరోగ్య ), డిఇసి నెంబర్లుగా
కె.శివశంకర్ (ఆర్అండ్ బి), ఏ.నాగరాజు (జైల్లు), యం.రాంబాబు (ఏపిజిఎల్),లు
ఏకగ్రీవంగా ఎన్నికైయ్యారని, నూతన కార్యవర్గం పదవీకాలం మూడేళ్ళ పాటు
కొనసాగుతుందని ఎన్నికల అధికారి తెలిపారు. ఏపిఎన్జివో అసోసియేషన్ మాజీ నేతలు
జి.నారాయణరావు, రాజారావు, టి.సత్యనారాయణ, కోనేరు రవి, డి.సత్యనారాయణ రెడ్డి,
యం.నాగార్జున, బి.ఆనంద్, వి.సూర్యబాబు, వివిధ శాఖల ఉద్యోగ సంఘ నాయకులు, జిల్లా
కార్యవర్గ సభ్యులు, జిల్లాలోని వివిధ తాలుకా యూనిట్ల కార్యవర్గ సభ్యులు
ఉద్యోగులు పాల్గొని నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు.