ఈ సంక్రాంతికి ‘ వీర సింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలతో రెండు
విజయాలు ఖాతాలో వేసుకుంది నటి శ్రుతిహాసన్. ఇప్పుడు ప్రభాస్ తో కలిసి ‘సలార్’
తో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ‘కేజీఎఫ్’ సిరీస్ విజయాల తర్వాత ప్రశాంత్
నీల్ రూపొందించిన పాన్ ఇండియా చిత్రమిది. హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మించింది.
ఈ సినిమా నిర్మాణాంతర పనులు శరవేగంగా జరుగుతున్నాయి. శ్రుతి తన పాత్ర కోసం
డబ్బింగ్ చెప్పడం షురూ చేసింది. ఈ క్రమంలోనే ఆమె ఓ ఆసక్తికర విషయాన్ని
పంచుకుంది. ‘సలార్’ కోసం మొత్తం ఐదు భాషల్లోనూ తన సొంత గొంతునే వినిపించనుందట.
ఇప్పటికే మూడు భాషలకు సంబంధించిన డబ్బింగ్ పనులు పూర్తయ్యాయని మరో రెండు
భాషల్లో డబ్బింగ్ చెప్పాల్సి ఉందని సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేసింది. ఈ
చిత్రంలో ఆమె ఆద్య అనే పాత్రలో కనిపించనుంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా
ముస్తాబైన ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సెప్టెంబరు 28న
విడుదల కానుంది. వచ్చే నెల తొలి వారంలో ట్రైలర్ విడుదల చేసేందుకు సన్నాహాలు
చేస్తున్నారు.