శరీరానికి రక్తహీనత లేదా ఐరన్ లోపంతో బాధపడేవారు అప్రమత్తంగా ఉండాలి. ఆహారం
విషయంలో అస్సలు అశ్రద్ధ చేయకూడదు. సాధారణంగా రక్తహీనత సమస్య ఎక్కువగా
మహిళల్లోనే కనిపిస్తుంది. అలాగే, గర్భవతుల్లో కూడా ఈ సమస్య ఉంటుంది. కాబట్టి..
వీరు శరీరంలో రక్త శాతం తగ్గకుండా ఐరన్ సమృద్ధిగా కలిగిన ఆహారాన్ని
తీసుకోవాలి. జంక్ ఫుడ్‌కు దూరంగా ఉంటూ సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. పండ్లు,
కూరగాయలను ఎక్కువగా తినాలి. మీ శరీరంలో ఐరన్ లోపం వుంటే అనేక సమస్యలు
ఎదురవుతాయి.శరీరంలో తగినంత రక్తం లేకపోవడాన్ని రక్తహీనత లేదా ఎనీమియా అంటారు. రక్తంలో
ఐరన్ లోపం, విటమిన్ సమస్యల వల్ల రక్తహీనత ఏర్పడుతుంది. సరైన పోషకాహారం
తీసుకోకపోతే రక్తహీనత ఏర్పడుతుంది. కళ్ళ చుట్టూ డార్క్ సర్కిల్స్, శరీరం
పసుపు రంగులోకి మారడం వంటి లక్షణాలుంటే ఐరన్ లోపంగా గుర్తించాలి. ఐరన్ సమస్య
ఉంటే బాగా నీరసంగా ఉంటారు. గోళ్ళు పెళుసు బారినా, లేత పసుపు రంగులోకి మారినా
రక్తంలో ఐరన్ స్థాయిలను చెక్ చేసుకోవాలి. రక్తహీనత, ఐరన్ తక్కువగా ఉంటే
వాంతులు, మలబద్ధకం లేదా అతిసారం, ఇతర కడుపు సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా
హీమోక్రోమాటోసిస్ అనేది శరీరంలోని ఐరన్‌ను విపరీతమైన స్థాయిలో నిలుపుకునే
పరిస్థితి. ఇది క్యాన్సర్ వంటి కాలేయ సమస్యలకు దారితీస్తుంది.