సృష్టించింది. గాలేలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న
ఐర్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 492 పరుగులకు ఆలౌట్ అయింది. అందుకు బదులుగా
శ్రీలంక విశ్వరూపం ప్రదర్శించింది.తన తొలి ఇన్నింగ్స్ ను 3 వికెట్లకు 704 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.
లంకేయులు కేవలం 151 ఓవర్లలోనే ఈ స్కోరు కొట్టారు. శ్రీలంక ఇన్నింగ్స్ లో
ఇద్దరు డబుల్ సెంచరీ బాదగా, మరో ఇద్దరు సెంచరీలు నమోదు చేశారు.ఓపెనర్ నిషాన్ మధుష్క 205, వన్ డౌన్ బ్యాట్స్ మన్ కుశాల్ మెండిస్ 245 పరుగులు
చేశారు. మరో ఓపెనర్, కెప్టెన్ దిముత్ కరుణరత్నే 115 పరుగులు చేయగా, సీనియర్
ఆల్ రౌండర్ ఏంజెలో మాథ్యూస్ 100 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు.
పెద్దగా టెస్టు మ్యాచ్ అనుభవంలేని ఐర్లాండ్ ఆటగాళ్లు… ఓవైపు లంక ఆటగాళ్ల
విజృంభణ, మరో వైపు విపరీతమైన వేడిమి వాతావరణంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. పసలేని
ఐర్లాండ్ బౌలింగ్ ను లంక బ్యాటర్లు ఓ ఆట ఆడుకున్నారు. ముఖ్యంగా, కుశాల్
మెండిస్ ఒక్కడే 18 ఫోర్లు, 11 సిక్సర్లు కొట్టాడు. నిషాన్ మధుష్క 22 ఫోర్లు, 1
సిక్స్.. కరుణరత్నే 15 ఫోర్లు… ఏంజెలో మాథ్యూస్ 6 ఫోర్లు, 4 సిక్సులతో
హడలెత్తించారు.
కాగా, ఓ టెస్టులో టాప్-4 బ్యాట్స్ మన్ సెంచరీలు బాదడం టెస్టు క్రికెట్
చరిత్రలో ఇది మూడోసారి మాత్రమే. 2007లో ఈ రికార్డును టీమిండియా నమోదు చేసింది.
బంగ్లాదేశ్ తో ఆడుతూ దినేశ్ కార్తీక్, వసీమ్ జాఫర్, రాహుల్ ద్రావిడ్, సచిన్
టెండూల్కర్ సెంచరీలు సాధించారు. ఆ తర్వాత 2019లో ఇదే ఘనతను పాకిస్థాన్
సాధించింది. శ్రీలంకపై ఆడుతూ పాక్ బ్యాటర్లు షాన్ మసూద్, అబిద్ అలీ, అజహర్
అలీ, బాబర్ అజాబ్ సెంచరీలు నమోదు చేశారు. ఇప్పుడు ఈ జాబితాలో శ్రీలంక కూడా
చేరింది.