న్యూఢిల్లీ : ప్రపంచ దేశాల ఆంక్షలతో ఒంటరిగా మారిన ఉత్తరకొరియాలో కరువు
రాజ్యమేలుతోంది. 1990ల నాటి కరువు కంటే తీవ్ర పరిస్థితులు అక్కడ
కొనసాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అప్పట్లో సుమారు 30 లక్షల మంది
ప్రాణాలొదిలారు. దేశంలో పంటల సాగు తగ్గిపోవడంతో ప్రజలకు సరిపోను ఆహార
పదార్థాలు లభ్యం కావడం లేదు. సరిహద్దులను పూర్తిగా మూసివేయడంతో పరిస్థితి
విషమంగా మారింది. సరిహద్దుల వెంట ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే జనం
ఆకలితోచనిపోతున్నట్లు సమాచారం. దేశంలో ఆహార కొరత ఏర్పడిన విషయాన్ని సాక్షాత్తూ
అధ్యక్షుడు కిమ్ స్వయంగా అంగీకరించడం గమనార్హం. మరోవైపు, ప్రభుత్వం
క్షిపణులు, అ«ణ్వాయుధాల తయారీకి భారీగా ఖర్చు పెడుతోంది.