హాలీవుడ్ తారలు జెన్నిఫర్ లోపెజ్, బెన్ ఆఫ్లెక్ లాస్వేగస్లో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని లోపెజ్ ధ్రువీకరించారు. ‘‘మేం పెళ్లి చేసుకున్నాం. ప్రేమ ఎంతో అందమైనది. మధురమైనది. మేం ఈ క్షణాల కోసం ఎంతో ఎదురుచూశాం’’అని తన ఇన్ స్టాగ్రామ్ లో ఆమె రాసుకొచ్చారు. నిజానికి 2003లోనే వీరిద్దరికీ మొదట నిశ్చితార్థమైంది. అయితే 2004 జనవరిలో దీన్ని రద్దు చేసుకున్నారు. తాజాగా వీరిద్దరూ మళ్లీ కలవబోతున్నారని గత ఏడాది తెలియడంతో అభిమానులు వేడుక చేసుకున్నారు. వీరిద్దరూ సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు ప్రేమను వ్యక్తం చేసేవారు.