ఓటీటీల్లో కొత్త సినిమాలు క్యూ కట్టాయి. ఇప్పటికే థియేటర్లలో విడుదలైన
సినిమాలు ఇప్పుడు ఓటీటీలో ప్రసారం కానున్నాయి. ఈ వారం పలు బ్లాక్ బస్టర్
సినిమాలు వివిధ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. గత నెల 3న థియేటర్లలో
విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న సినిమా ‘రైటర్ పద్మభూషణ్’.. సుహాస్ ప్రధాన
పాత్రలో, ఆశీష్ విద్యార్థి, రోహిణి, టీనా శిల్పరాజ్ కీలక పాత్రలు పోషించిన ఈ
చిత్రం మార్చి 17 న జీ5 లో స్ట్రీమింగ్ కానుంది.ధనుష్ హీరోగా వచ్చిన తొలి స్ట్రెయిట్ తెలుగు సినిమా ‘సార్’ కూడా రానుంది.
వెంకీ అట్లూరి దర్శకత్వంలో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా, సముద్రఖని, హైపర్
ఆది, తనికెళ్ళ భరణి, అక్కినేని సుమంత్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించిన ఈ
సినిమా ఫిబ్రవరి 17న థియేటర్లలో విడుదలైంది. దాదాపు వంద కోట్లకు పైగా వసూలు
చేసింది. ఈ సినిమా ఈ నెల 17వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. ఈ
నెల 16 నుంచి టబు ప్రధాన పాత్రలో నటించిన ‘కుత్తే’ సినిమా కూడా ఇదే ప్లాట్
ఫారంపై స్ట్రీమింగ్ కానుంది.

మార్చి 17 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్న మరో కొత్త సినిమా సత్తిగాని
రెండెకరాలు కూడా ఓటిటిలో రానుంది.. ‘పుష్ప’ సినిమాలో హీరో అల్లు అర్జున్
స్నేహితుడిగా నటించి మెప్పించిన జగదీశ్ ప్రతాప్ హీరోగా ఈ సినిమా తెరకెక్కింది.
ఈ సినిమాకు అభినవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. వెన్నెల కిశోర్, మోహనశ్రీ
తదితరులు ముఖ్యమైన పాత్రలలో నటించారు. వీటితో పాటు డ్వేయాన్ జాన్సన్ నటించిన
‘బ్లాక్ ఆడమ్’ మార్చి 15 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది.