టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
కడప : ఒడిశాలో జరిగిన రైళ్ల ప్రమాదం మహా విషాదం అని టిడిపి జాతీయ ప్రధాన
కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. వందల సంఖ్యలో ప్రయాణికులు
ప్రాణాలు కోల్పోవడం తీవ్రదిగ్భ్రాంతికి గురయ్యాను. మృతులకి అశ్రునివాళులు.
బాధిత కుటుంబాలకు మనమంతా అండగా నిలవాల్సిన సమయం ఇది. క్షతగాత్రులకి
తక్షణ వైద్యసాయం అంది వారు త్వరగా కోలుకోవాలని దేవుడిని
ప్రార్థిస్తున్నానని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
పేర్కొన్నారు.