భువనేశ్వర్ : ఒడిశాలో రైలు దుర్ఘటనపై దర్యాప్తుకు సీబీఐతో విచారణకు రైల్వే
బోర్డు సిఫారసు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
ప్రకటించారు. ఒడిశాలోని బాలేశ్వర్ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనపై
దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని రైల్వే బోర్డు నిర్ణయించినట్టు కేంద్ర
రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ దుర్ఘటనపై సీబీఐతో
దర్యాప్తు చేయాలని రైల్వే బోర్డు సిఫారసు చేసిందని తెలిపారు. ఆదివారం సాయంత్రం
ఆయన భువనేశ్వర్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. సహాయక కార్యక్రమాలు
పూర్తయ్యాయని, ఘటనా స్థలిలో పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయని చెప్పారు.
రైల్వే ట్రాక్‌కు సంబంధించిన పనులు పూర్తయ్యాయన్న మంత్రి ఓవర్ హెడ్ వైరింగ్
పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. బాధితులకు ఆస్పత్రుల్లో చికిత్స
కొనసాగుతోందన్నారు. శుక్రవారం రాత్రి మూడు రైళ్లు ఢీకొట్టిన ఘటనలో 275మంది
మృతిచెందగా.. 1100మందికి పైగా గాయపడిన ఘటన పెను విషాదం నింపిన విషయం
తెలిసిందే. ప్రస్తుతం ఈ కేసును ప్రభుత్వ రైల్వే పోలీసులు దర్యాప్తు
చేస్తున్నారు. సిగ్నలింగ్‌లో సమస్య కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు
ప్రాథమికంగా తేలినట్టు రైల్వే బోర్డు సభ్యురాలు జయవర్మ సిన్హా వెల్లడించారు.
రైల్వే సేఫ్టీ కమిషనర్ నుంచి పూర్తి స్థాయి నివేదిక రావాల్సి ఉందన్నారు. ఈ
ఘటనలో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ మాత్రమే ప్రమాదానికి గురైనట్టు, ఆ సమయంలో దాని
వేగం దాదాపు గంటకు 128 కి.మీలుగా ఉన్నట్టు ఆమె వెల్లడించారు. గూడ్స్ రైలులో
ఇనుప ఖనిజం ఉండటం వల్లే ప్రమాద తీవ్రత పెరిగిందని అభిప్రాయపడుతున్నట్టు
చెప్పారు.