చౌటుప్పల్ : బీజేపీ, తెరాస నేతలు ఓటమి భయంతోనే కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నారని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. జైకేసారం గ్రామంలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రచారంలో భాజపా కార్యకర్తలు దాడి చేయడంతో గాయపడిన కాంగ్రెస్ కార్యకర్తలు మోటె నవీన్, తాటి అమర్లను ములుగు ఎమ్మెల్యే సీతక్కతో కలిసి ఉత్తమ్ పరామర్శించారు. అధైర్యపడొద్దని అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. దాడి చేసిన నిందితులపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అనంతరం రాత్రి కైతాపురం, అంకిరెడ్డిగూడెం, ఆరెగూడెం, కాట్రేవ్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్ రెడ్డి, ఆలేరు నియోజకవర్గ ఇన్‌ఛార్జి బీర్ల అయిలయ్య, తంగెళ్లపల్లి రవికుమార్, రవి పాల్గొన్నారు.’